Bramhamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. జరిగిన పొరపాటు వెనకాల భార్య హస్తం ఉందని అనుమానిస్తున్న ఒక భర్త కథ ఈ సీరియల్.. కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సీరియల్ మంచి సక్సెస్ రేటుతో దూసుకుపోతుంది..ఇక ఈరోజు 11 ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం..

ఎపిసోడ్ ప్రారంభంలోనే అపర్ణ పుట్టింటికి వెళ్ళడానికి సూటికేసు తో రెడీ అవుతుంది..నా కొడుకుకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను.. అమాయకుడును చేసి వాడికి ఇష్టం లేని అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేశారు.. వాడిని నాకు దూరం చేస్తున్నారు.. నా మాటకు ఇక్కడ విలువ లేదు అంటూ వాదన వినిపిస్తుంది. దానికి అపర్ణ అత్త కంగారుపడుతూ.. సర్ది చెప్పాలని చూస్తుంది.. నువ్వు ఇంట్లో నుంచి వెళితే కుటుంబం పరువు పోతుంది..ఇప్పుడు ఒక అత్తవు నువ్వు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా ఆలోచించు అంటుంది..తప్పు చేస్తున్నావ్ ఆలోచించు అంటుంది.. దానికి అపర్ణ నా కొడుకును బలవంతం చేసి పెళ్లి చేసావు.. వాడికి నూరి పోసావు.. ఇప్పుడు ఇష్టం లేకుండా వాడు ఇబ్బంది పడుతున్నాడు నేను చూడలేను నేను వెళ్లి పోతాను అంటుంది..

ఇక కుటుంబ సభ్యులు మొత్తం ఒక్కొక్కరు అపర్ణకు నచ్చ చెప్పే పని చేస్తారు.. ఇక భర్త చెప్పిన అపర్ణ నిర్ణయాన్ని మార్చుకోదు.. సూటికేసు తో గుమ్మం వరకు వెళ్తుంది.. వెంటనే తన భర్త పిలుస్తాడు.. ఒక్క నిమిషం అపర్ణ.. గుమ్మం దాటి బయటకు వెళితే మళ్లి లోపలికి రావడం కుదరదు.. గుర్తుపెట్టుకో.. అంటే అపర్ణ వెంటనే సూటికేసు ను గుమ్మం దగ్గర పక్కకు నెట్టేసింది.. ఇంటి పరువు నన్ను ఆపేసింది అంటూ వెనక్కి వస్తుంది.. ఇక రాజ్ అత్తగారింట్లో ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు.. అది కాస్త పన్నీగా అనిపిస్తుంది.స్వప్న కోసం వెతుకుతాడు.. అంతలోనే డోర్ బెల్ మొగుతుంది.. ఒకతను చేపలు తీసుకొని వచ్చి హంగామా చేస్తాడు.. దానికి రాజ్ ఇబ్బంది పడుతుంటే పక్కనే ఉన్న కావ్య లోలోపల నవ్వుకుంటుంది..

ఆ తర్వాత కాలనీ లోని ఆడవాళ్లు వస్తారు.. వాళ్ళలో కావ్య పెద్దమ్మ కామెడీ తో కాసేపు నవ్వులు పూస్తాయి.. నీది చాలా పెద్ద మనసు.. మా కావ్యను పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు ఇలా మా ఏరియాకు రావడం.. అనగానే కావ్య వాళ్ల అమ్మ వస్తుంది.. అల్లుడు ఏం కావాలని చెప్పాడు. మర్యాదలు బాగా చేస్తున్నావా అంటే లేదక్కా.. అస్సలు అల్లుడు మాట్లాడలేదు అంటూ సమాధానం చెబుతుంది.. దానికి ఆవిడా ఏం కావాలి చెప్పు బాబు చేప కావాలా, రొయ్యలు కావాలా, ముక్క కావాలా చుక్క, స్ప్రేట్ కావాలా అంటూ హడావిడి చేస్తుంది.. దానికి రాజ్ ఏమొద్దు అంటాడు..
అలా అంటే కుదరదు మా మర్యాదలు చూడాల్సిందే అంటుంది.. అదంతా చూస్తున్న కావ్య పక్కనే నవ్వుకుంటూ ఉంటుంది.. ఆ ఎపిసోడ్ పూర్తవుతుంది.. తర్వాయి భాగంలో రాజ్ ఉక్కపోతకు తట్టుకోలేక పోతాడు.. మీరు కొద్దిగా ఓపిక పట్టండి.. ఏది చెప్పకండి మా నాన్న బాధ పడతారు అంటూ కావ్య అంటుంది.. దానికి రాజ్ ఎవరు భాధపడితే నాకేంటి అంటాడు.. ఆ తర్వాత కావ్య వాళ్ల నాన్న నువ్వు అత్తింటిలో సంతోషంగా ఉన్నావా అంటాడు.. అలా అడిగావేంటి నేను బాగానే ఉన్నాను అంటుంది..మరి కావ్య ఏం చెబుతుంది, రాజ్ కు స్వప్న కనిపిస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..