GodFather: మెగాస్టార్ చిరంజీవి.. కొత్త సినిమా “గాడ్ ఫాదర్” ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఫస్ట్ టైం చిరంజీవి ప్రైవేట్ ఫ్లైట్ లో ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేస్తూ సినిమాకి సంబంధించి అనేక విషయాలు రాబడుతూ మరోపక్క కామెడీ కూడా చేయటం జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాత్ర గురించి చిరంజీవిని ప్రశ్న వేయడం జరిగింది. చిరంజీవి సమాధానం ఇస్తూ… సినిమాలో యూట్యూబర్ క్యారెక్టర్ చేశాడు. చెప్పాలంటే డైరెక్టర్ వాయిస్ అది. దానికి డైరెక్టర్ మోహన్ రాజా ఏదైనా హీరో చేత చెప్పిద్దామని అనుకున్నారు.
కానీ కరోనా టైంలో… పూరి యూట్యూబ్ ఛానల్ లో చెప్పిన మ్యూజింగ్స్.. ఇంకా అనేక విషయాలు నాకు అప్పుడు తట్టాయి. వెంటనే ఈ పాత్రకి పూరి అయితే కరెక్ట్ అని డైరెక్టర్ కి నేనే చెప్పాను. దానికి మోహన్ రాజా కూడా ఓకే చెప్పారు. వెంటనే పూరి జగన్నాథ్ కి ఫోన్ చేశాను. ఇలా సినిమాలో యూట్యూబర్ జర్నలిస్టు పాత్ర చేయాలి.. అని అనగానే ససేమేరా నేను నటించను అనేశాడు. సీన్ రొటేట్ చేస్తాను గానీ.. కెమెరా ముందు నటించలేను.. అన్నా అంటూ ఫోన్ లో చెప్పాడు. అయితే చిన్న పాత్ర అని చెప్పటంతో చివర ఆఖరికి పూరీ ఒప్పుకున్నాడు.
అయితే పూరి సన్నివేశాలు చిత్రీకరించాల్సిన సమయం వచ్చేసరికి… క్యారీవ్యాన్ దిగట్లేదు. చివర ఆఖరికి ఎలాగైతే దిగొచ్చాడు. అదే సమయంలో ఛార్మి వచ్చి అన్నయ్య వణికిపోతున్నాడు. నాకు క్యారెక్టర్ అవసరమా అని అంటున్నాడు. కానీ చివర ఆఖరికి పూరి జగన్నాథ్ తన సన్నివేశాలు చేయడం జరిగింది. పూరిలో అద్భుతమైన నటుడు ఉన్నాడు. సినిమాలో చాలా న్యాచురల్ గా పూరి సీన్స్ ఉంటాయి. రేపొద్దున సినిమా చూశాక జనాలు కూడా ఇదే చెబుతారు. కచ్చితంగా పూరి జగన్నాథ్ తన పాత్రకి న్యాయం చేశాడు అంటూ చిరంజీవి తెలియజేశారు.
Premikudu re release: రీ రిలీజ్ కి రెడీ అయిన ప్రభుదేవా ” ప్రేమికుడు ” మూవీ.. రిలీజ్ డీటెయిల్స్ ఇవే..!