Anil Ravipudi-Tamannaah: షూటింగ్ సమయంలో దర్శకనిర్మాతలకు, ఆర్టిస్ట్‌లకు మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడం సర్వ సాధారణం. అలాంటి గొడవే మిల్కీ బ్యూటీ తమన్నా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య ఏర్పడింది. వీరిద్దరూ ఇటీవల `ఎఫ్ 3` సినిమా కోసం కలిసి పని చేశారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకున్న మల్టీస్టారర్ మూవీ ఇది.
ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర టీమ్ మొత్తం పాల్గొన్నా.. తమన్నా మాత్రం కనిపించలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి, తమన్నాలకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమే అంటూ అనిల్ రావిపూడి కుండబద్దలు కొట్టాడు. అయితే, తమన్నాకు తనకు మధ్య సెట్స్ జరిగిన గొడవ చిన్నదేనని.. ఆ గొడవ జరిగిన రెండు రోజులకు అంతా సర్దుబాటు అయిపోయిందని ఆయన పేర్కొన్నారు.
కానీ, తమన్నా ప్రవర్తన చూస్తుంటే అలా కనిపించడం లేదు. సినిమా విడుదలై తర్వాత కూడా మేకర్స్ తమ ప్రచారం ఆపలేదు. ఏదో ఒక రూపంలో ప్రమోషన్స్ నిర్వహిస్తూనే ఉన్నారు. రీసెంట్గా కూడా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ వైపు కనీసం తమన్నా కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో తమన్నా-అనిల్ రావిపూడి మధ్య గొడవ ఇంకా సద్దుమణగలేదంటూ ప్రచారం మొదలైంది.