Nayan-Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్ ఇటీవల పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. `నాను రౌడీదాన్` సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడ్డ వీరిద్దరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ లవ్ బర్డ్స్.. గత లాక్డౌన్లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.
జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితల నడుమ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం నయన్-విఘ్నేశ్‌ల వెడ్డింగ్‌లో సందడి చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. నయన్-విఘ్నేశ్‌లు తమ పెళ్లికి పైసా కూడా ఖర్చు పెట్టలేదట. పెళ్లి వస్త్రాల ఖర్చు మినహా.. మిగతా ఖర్చు మొత్తాన్ని ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్సే పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వివాహం కోసం రూ.25 కోట్ల దాకా నెట్‌ఫ్లిక్స్ చెల్లించిందనే టాక్ నడుస్తోంది.
నయన్-విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వేడుక తాలూకు డిజిటల్ హక్కులు తీసుకోవడం వల్లే.. నెట్‌ఫ్లిక్స్ వారు అంతలా ఖర్చు పెట్టారని అంటున్నారు. ఇకపోతే నయన్-విఘ్నేశ్ ల వెడ్డింగ్ వీడియోను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. వీరి పెళ్లిని ఓ డాక్యుమెంటరీలా చిత్రీకరించే బాధ్యతని అక్కడి స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ చూసుకున్నట్లు తెలుస్తోంది.