Unstoppable 2: “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ బిగ్ స్టార్స్ రావడం తెలిసిందే. సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు రావడంతో ఈ షోకి మొదట్లో కంటి ఇప్పుడు మరి ఆదరణ పెరిగింది. హోస్ట్ గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. షోలో మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయ్యేలా ప్రశ్నలు అడుగుతూ రకరకాల టాస్క్ లు పెడుతూ షోలే పాల్గొన్నే అతిథులు కూడా ఎంజాయ్ చేపిస్తున్నారు. ఇదే సమయంలో వారి కెరీర్ కి సంబంధించి కాంట్రవర్సీ పరిస్థితులు గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోకి ప్రభాస్ మరియు గోపీచంద్ రావటం తెలిసిందే. డిసెంబర్ 30వ తారీకు ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
కాగా డిసెంబర్ 17వ తారీకు ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా విడుదలైన అన్ని ప్రోమో లలో కంటే ప్రభాస్.. అన్ స్టాపబుల్ ప్రోమోలో చాలా ఫన్ ఉంది. బాలయ్య మరియు ప్రభాస్ ఇద్దరు కూడా చాలా జాలీగా షో మరింత ఎంటర్టైన్మెంట్ అయ్యేలా..చేశారు. ప్రభాస్ గతంలో ఎన్నడూ లేని రీతిలో చాలా ఫన్నీగా… షోలో కనిపించడం జరిగింది. ఇంకా ఇదే సమయంలో షోలో… ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ మధ్యలో రావడంతో… షో మరింత ఎంటర్టైన్మెంట్ గా మారింది. అయితే ఈ క్రమంలో 2008వ సంవత్సరంలో ఓ హీరోయిన్ కోసం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఎవరికోసం మీరిద్దరు గొడవ పడ్డారు అని బాలకృష్ణ ప్రశ్నించడం జరిగింది.
ఈ ప్రశ్నకు ప్రభాస్ మేమిద్దరం ఎవరికోసం గొడవ పడలేదని కాస్త కవరింగ్ చేసినట్టు మాట్లాడారు. దీంతో ఈ ప్రశ్న అభిమానులలో అనేక చర్చలకు దారి తీసింది. బాలకృష్ణ 2008వ సంవత్సరం అనేసరికి సరిగ్గా అదే టైములో… గోపీచంద్ “సౌర్యం” సినిమా చేస్తున్నారు. ప్రభాస్ “బిల్లా” సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో ఓకే హీరోయిన్. ఆమె మరెవరో కాదు స్వీటీ అనుష్క. దీంతో అనుష్క కోసమే ప్రభాస్.. గోపీచంద్ మధ్య గొడవ జరిగినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా ఇదే సమయంలో అనుష్క మరియు ప్రభాస్ గురించి అనేక వార్తలు రావడం తెలిసిందే. దీంతో ఆ హీరోయిన్ కోసమే ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవ అయ్యుండొచ్చని భావిస్తున్నారు.