NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 5: కార్తీక్ తో నేను సెటిల్ అయ్యి… దీపకు ఆటోవాడిని సెట్ చేస్తా అంటున్న మోనిత..!!

Karthikadeepam serial today episode review November 5 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1502వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 5 న ప్రసారం కానున్న Karthika Deepam serial,1502 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో.. ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1502 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. గత ఎపిసోడ్ లో సౌర్యను చూడడానికి హిమ, ఆనందరావు సౌర్య ఇంటికి వస్తారు. ఇక వాళ్ళను చూసి ఇంద్రమ్మ షాక్ అవుతుంది. సౌర్యా మన ఇంటికి వచ్చేయ్…నేనే నీ ప్రాబ్లమ్ అయితే హాస్టల్‌కి వెళ్లిపోతాను.. అంతే కానీ.. ఇక్కడెక్కడో ఉండొద్దు’ అంటుంది హిమ.. కానీ సౌర్య మాత్రం హిమ వినదు. ‘నా గురించి ఎవ్వరూ ఏ త్యాగాలు చేయాల్సిన పనిలేదు’ అంటుంది. ‘తాతయ్యా నేను రాను.. అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారని నాకు నమ్మకంగా ఉంది.. వాళ్లని తీసుకునే వస్తాను’ అంటుంది సౌర్య. ‘వాళ్లు దొరకడానికి వాళ్లు తప్పిపోలేదుమ్మా.. వాళ్లే ఉంటే మనల్ని వెతుక్కుంటూ కచ్చితంగా మన ఇంటికి వస్తారు.. నువ్వు మాతో వచ్చేయ్ అంటాడు ఆనందరావు.

ఇంద్రుడుపై అరిచిన ఆనందరావు :

ఇంతలో చంద్రుడు వచ్చి తను రాను అంటోంది కదా? వదిలేయొచ్చు కదా?’ అంటాడు ఆనందరావుతో ఆ మాట చెప్పడానికి.. నువ్వు ఎవరు? తను నా మనవరాలు.. నచ్చజెప్పి తీసుకుని వెళ్తాను.. లేదా బలవంతంగా తీసుకుని వెళ్తాను.. నీకేం సంబంధం..?’ అంటాడు ఆనందరావు. అసలు మీ మీదే నాకు అనుమానంగా ఉంది. చిన్న పిల్ల ఇంట్లోంచి బయటికి వచ్చేస్తే ఎలాగోలా నచ్చజెప్పి వాళ్ల ఇంటికి పంపించాల్సింది పోయి ఇన్ని రోజులు ఎవరైనా ఉంచుకుంటారా? ఏం నా మనవరాలిని మీ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటున్నారా?’ అంటాడు ఆనందరావు సూటిగా.ఇంతలో సౌర్య తాతయ్యా ఆగండి పిన్నీబాబాయ్‌లని ఏం అనొద్దు. వాళ్లు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మీకు తెలియదు అంటుంది సౌర్య. నాకు తెలుసు అమ్మా..ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. నా మనవరాల్ని మా నుంచి దూరం చెయ్యలేరు. మా మనవరాలు మాతో వచ్చే వరకూ మేము ఇక్కడే ఉంటున్నాం.. అంత వరకూ కదిలేదే లేదు. ఖర్చులకు ఉంచు’ అంటూ డబ్బు కట్ట ఇంద్రుడు చేతిలో పెడతాడు ఆనందరావు.

ఆటో వాలా గురించి దీపను అడిగిన మోనిత :

ఇక దీప ఇంట్లో కూర్చుని సౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మోనిత కూల్‌గా వచ్చి దీపకు ఎదురుగా కింద కూర్చుని నేను ఇప్పుడు గొడవ పడటానికి రాలేదు..నాకో విషయం చెప్పు అని..నీకు ఇక్కడ ఆటో వాళ్లు ఎవరైనా తెలుసా?’ అంటుంది మోనిత. ‘ఏం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నావా? అలా అయితే ఆటో ఏం సరిపోతుంది? లారీ మాట్లాడతా’ అంటుంది దీప కామెడీగా. ‘జోక్స్ వేస్తే నవ్వే ఓపిక నాకు లేదు.. ప్లీజ్ చెప్పు ఇది మా భార్యభర్తల విషయం అంటుంది మోనిత. వెంటనే ‘భార్యభర్తలేంటే?’ అని మోనిత పీక పట్టుకుంది దీప.కూల్ కూల్ అంటూ నేను గొడవ పడటానికి రాలేదు.. జెస్ట్ ఈ సమాచారం ఇస్తే వెళ్లిపోతాను’ అంటుంది మోనిత.

మోనితను కొట్టిన దీప :

వెంటనే దీప ‘ఎందుకు?’ అంటుంది.నేను అడిగిన దానికి జవాబు చెప్పు అంటుంది.నేను కలిసిన ఆటో డ్రైవర్ గురించి దీనికెందుకు? ఇంద్రుడు ఏమైనా మోనితని కలిశాడా? సౌర్య గురించి చెప్పాడా? వీళ్లిద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారా?’ అంటూ మనసులోనే ఆలోచిస్తూ ఉంటుంది దీప.ఇక్కడ ఎన్నో వందల మంది ఆటోవాళ్లు ఉండగా.. నాకు తెలిసిన ఆటో డ్రైవర్‌తోనే నీకు పనేంటీ?’ అంటుంది దీప. ఏమిలేదు నీ స్థాయి తగ్గట్టు నీకు వాడ్నిసెట్ చేసి.. కార్తీక్‌తో నేను సెటిల్ అవుదామని..’ అంటూ వెటకారం చేస్తూ పైకి లెగవబోతుంటే వెంటనే దీప మాత్రం మోనితని తనవైపుకు లాగి లాగిపెట్టి కొడుతుంది. ‘నన్ను కొడతావా?’ అంటుంది మోనిత కోపంగా. ‘పిచ్చి వాగుడు వాగితే ప్రాణాలే తీసేస్తా’ అంటుంది దీప. ‘తేలుస్తా.. నీ సంగతేంటీ? ఆ ఆటోవాడి సంగతి. నువ్వూ కార్తీక్ కలిసి చేస్తున్న గూడు పుటానీ ఏంటో.. అంతా తేలుస్తాను’ అంటూ మోనిత కోపంగా వెళ్లిపోతుంది.

మోనితను కార్తీక్ దగ్గర ఇరికించిన దుర్గా :

మోనిత అదే ఆవేశంలో ఇంటికి వచ్చేసరికి.. కార్తీక్ సౌర్య కోసం ఆలోచిస్తూ ఉంటగా… మోనిత వెళ్లి నా మీద అనుమానం ఏంటీ కార్తీక్ అంటూ ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో దుర్గ వచ్చి.. ‘మోనితా నీకోసమే.. నువ్వు అడిగావనే.. ఊరంతా తిరిగి ఈ హైదరాబాద్ బిర్యానీ తెచ్చాను తిను అంటూ కార్తీక్ దగ్గర మోనితను ఇరికిస్తాడు. ఇక కార్తీక్ కోపంగా మోనితను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మోనితపై బలపడిన కార్తీక్ అనుమానం :

సీన్ కట్ చేస్తే.. దీప, కార్తీక్‌లు సౌర్య కోసం వెతకడం మొదలుపెడతారు. అప్పుడే కార్తీక్‌తో దీప.. ‘మోనితనీకు ఇక్కడ ఆటో వాళ్లు ఎవరైనా తెలుసా? అని అడిగింది డాక్టర్ బాబు అని చెబుతుంది.దీప అలా చెప్పడంతో కార్తీక్‌కి.. సౌర్య విషయంలో మోనిత మీద మరింత అనుమానం బలపడుతుంది. ఇక దీపతో.. ‘నిన్న ఇంద్రుడు నాకు రోడ్డు మీద కనిపించాడు. నేను ఆగమనడంతో పట్టనట్లుగా కావాలనే వెళ్లిపోయాడు దీపా’ అంటాడు కార్తీక్. దాంతో దీప.. సౌర్య గురించి కంగారు పడుతుంది. కంగారు పడొద్దు అని ధైర్యం చెబుతాడు కార్తీక్.

చంద్రమ్మను కొట్టిన ఇంద్రుడు :

ఇక తరువాత సీన్ లో ఇంద్రుడు చంద్రమ్మ చెంప చెల్లుమనిపిస్తాడు. ‘పిల్లని వాళ్ళ తాతయ్యతో ఎలా తీసుకుని వెళ్లనిచ్చావ్’ అంటూ అరుస్తాడు భార్య మీద. ఇద్దరు మనవరాళ్లతో కలిసి అలా తిరిగి వస్తాం అంటూ ఆ పెద్దాయన తీసుకుని వెళ్లాడు అని అంటుంది.వాళ్ల మనవరాల్ని నేను ఎలా ఆపగలను గండా?’ అంటుంది చంద్రమ్మ ఏడుస్తూ. ‘వాళ్ల మనవరాలు కాదు.. మన బిడ్డ.. జ్వాలమ్మ మన బిడ్డ అంటూ అరుస్తాడు కోపంగా ఇంద్రుడు. ఒకవేళ బలవంతంగా జ్వాలమ్మని లాక్కునిపోతే?అని నేను వెళ్లి వెతుకుతాను.. ఆయన తీసుకుని వస్తే మాత్రం నాకు కాల్ చేసి చెప్పు’ అంటూ ఇంద్రుడు ఆటో ఎక్కబోతూ ఆగుతాడు. ఆటో వెనుక ఉన్న ‘అమ్మా నాన్నా ఎక్కడున్నారు’ అనే స్టిక్కర్‌ని తీసేసి ఆటోలో బయలుదేరడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri