Krishna Mukunda Murari: ఏసిపి సార్ ఎన్ని రోజులని మీ మనసులో మీరే మీ పెద్దమ్మని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి మీ పెద్దమ్మకు ఫోన్ చేయండి అని కృష్ణ సలహా ఇస్తుంది. తన సలహా మేరకు మురారి ఒకసారి వాళ్ళ పెద్దమ్మకు ఫోన్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోసారి చేయమని కృష్ణ అంటుంది. అప్పుడు కాల్ కట్ చేసింది అని కృష్ణతో మురారి అంటాడు మీరే కాల్ చేస్తున్నారు అని మీ పెద్దమ్మకు తెలిసింది కదా, ఇంకోసారి కాల్ చేయమని కృష్ణ అంటుంది. ఈసారి బ్లాక్ లిస్టులో పెట్టింది అని మురారి ముభావంగా చెబుతాడు. అయితే ఈ విషయాన్ని నేనే తెలుస్తాను అని కృష్ణ భవాని దగ్గరకు బయలుదేరుతుంది . కానీ తనకి గన్ గురిపెట్టిన సీన్ గుర్తు వచ్చి యావ్ అనే అరుస్తూ ఒక్కసారిగా మురారి ఒడిలో పడుతుంది కృష్ణ. కృష్ణ అరుపు వినిపించిన ముకుందా వెంటనే వాళ్ళ గదిలోకి తొంగి చూస్తుంది మురారి ఒడిలో కూర్చున్న కృష్ణని చూసి కోపంతో రగిలిపోతుంది ముకుంద.

Krishna Mukunda Murari: కృష్ణ మురారిని అలా చూసినా ముకుందా.? రేపటికి సూపర్ ట్విస్ట్.!
ఇక ఇద్దరి మధ్యన జరిగే గిలిగింతలు చూసిన ముకుంద వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువుని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆ మధ్యలోనే మురారిని కృష్ణ యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ను కృష్ణ చించేసినట్టు మురారిని యాక్సెప్ట్ చేసినట్టు ముకుందా ఊహించుకుంటుంది. అది ఊహని తెలియగానే వెంటనే నో అని పెద్దగా అరుస్తుంది. ముకుంద హమ్మయ్య ఇది కలగగానే ఉండాలి. ఈ కళ నిజం కాకూడదు అని కృష్ణ మనసులో అనుకుంటుంది. వీళ్లిద్దరిని ఎప్పటికైనా విడగొట్టాల్సిందే అని ముకుందా అనుకుంటుంది. ఇంతకీ వీళ్లిద్దరు ఎక్కడున్నారు అని ముకుందా వాళ్లకోసం వెతుకుతూ ఉండగా.. కృష్ణ హాల్లో మురారి కి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది.
Brahmamudi: కావ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? స్వప్న వెనకున్నది రాహుల్ అని తెలిసిపోతుందా..

కృష్ణ నందిని పెళ్లి చేసిన కళ్యాణ మండపం డెకరేషన్ అతనికి పంతులు గారికి ఫోన్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక కృష్ణ చెప్పినట్టుగానే వాళ్ళు ఇంటికి వస్తారు హాల్లో ఎదురుగా భవానిని చూసి డబ్బుల కోసం వచ్చారని రేవతి చెబుతుంది ఇక వెంటనే డబ్బులు మురారినివ్వమంటారా అని అనగానే ముకుందా కాదు అని భవాని లేచి తన గదిలోకి వెళ్లి డబ్బులు తీసుకొస్తుంది. ఆ డబ్బులను ముకుందాకు ఇచ్చి వాళ్ళకి ఎంత రావాలో లెక్క చూసి అంతకు ఎక్కువ ఇవ్వమని భవాని అంటుంది. సరే అని ఆ డబ్బులు లెక్క చూసి ముకుందా వాళ్లకి ఇచ్చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులను మళ్లీ నాకు తిరిగి మురారి ఇస్తాడు. తన భార్య ఇస్తుందో ఏం చేస్తారో నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇవ్వండి అని భవాని అంటుంది. ఇంకోసారి ఇలాంటి చౌకబారు పనులు చేయొద్దు అంటూ భవాని కృష్ణ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Nuvvu nenu prema: అను, ఆర్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. విక్కీ పెళ్లిని ఫంక్షన్ లో అనౌన్స్ ?

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుంది. వాళ్ళ నాన్న స్నేహితుడు కూడా అక్కడికి వస్తాడు మురారితో ఎలా ఉంటుంది. నీ లైఫ్ అని అడిగితే నాన్నను చంపారన్న బాధ తప్ప ఇంకేమీ లేదు అని కృష్ణ అంటుంది. అయ్యో నువ్వు ఏసీబీ సార్ ని తప్పుగా అనుకుంటున్నావ్ అమ్మ మీ నాన్న కోడ్ లాంగ్వేజ్ లో తనని చంపమని మురారికి సైగ చేశాడు. ఆ సైగల్లోనే మురారి తనని షూట్ చేసినప్పుడు మీ నాన్న తప్పుకోవాలి కానీ అలా మిస్ ఫైర్ అయ్యింది అని ఆయన చెబుతారు. తన తండ్రిని చంపింది మురారి కాదని తెలుసుకున్న కృష్ణ ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.