Nuvvu nenu prema: అను, ఆర్యల పెళ్లికి ముహూర్తం పెట్టిన విషయం తెలిసిందే.. అందరు చాలా సంతోషంగా ఉంటారు.. అయితే ఆర్య అను ఇద్దరు కలుసుకుంటారు.. వారి పెళ్లి ఫిక్స్ అవ్వడం పై చాలా సంతోషంగా ఉంటారు.. ఇద్దరు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఆ సీన్ ఎపిసోడ్ కు హైలెట్ అని చెప్పాలి.. కొన్ని నిమిషాల పాటు సినిమాలోకం లోకి తీసుకొని వెళ్తారు ఆ జంట..పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఏం చెయ్యాలో చెబుతారు.ఇక పద్మావతి ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు.. అయితే పద్మావతి కుచల లాగా రెడీ అయ్యి వస్తుంది.. అందరు పద్మావతిని చూసి షాక్ అవుతారు.. పద్మావతి అను అత్తగారుగా చేసి అనును ఏడిపిస్తుంది.. అందరు షాక్ అవుతారు.. పద్మావతి కూడా అలానే చెయ్యడంతో కాసేపు కామెడీగా ఉంటుంది.. ఇంట్లో సరదాలు వెల్లువిరుస్తాయి.. ఇక అండాలు మీ ఇద్దరినీ కలిపే బాధ్యత ఆ శ్రీరామ చంద్రుడిదీ అంటుంది.. అను పెళ్లి అయ్యి వెళ్ళిపోతే ఇంట్లో సందడి మొత్తం పోతుంది.. అని బాధపడుతుంది.
Nuvvu nenu prema: అను, ఆర్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. విక్కీ పెళ్లిని ఫంక్షన్ లో అనౌన్స్ ?
అప్పుడు ఇద్దరు అత్త దగ్గరకు వచ్చి బాధపడకు అత్త నేను అక్క దగ్గరకు రోజూ వెళ్తాను అంటుంది.. ఆ తర్వాత కుచల వెళ్తు ఉంటే రోడ్డు మీద మాయ వల్ల అమ్మ కనిపిస్తుంది.. వనజ గారు బాగున్నారా.. అంతా బాగుంటే మనం కలిసి ఉండేవాళ్ళము ఇంట్లోనే కలుసుకొనేవాళ్ళము.. మీ మాయ చివరి నిమిషంలో ఇలా ఎందుకు చేసింది అంటుంది.. మా బేబీ కరెక్ట్ గానే ఉంది.. అంటే మా విక్కీ తప్పు చేశాడా అంత ఖర్మ మాకేం పట్టలేదు అంటూ కుచలా అంటుంది.. అందుకు కారణం ఆ అక్క చెల్లెల్లు.. ట్రైనింగ్ పేరుతో విక్కీని మార్చింది.. వలలో వేసుకుంది.. అని వెళ్ళిపోతుంది. ఏంటి ఈ డ్యామేజ్ చీరలు ఇలా చేస్తారా చూస్తాను అని వెళ్ళిపోతుంది.. ఇక అరవింద డెకరేషన్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
Brahmamudi: కావ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? స్వప్న వెనకున్నది రాహుల్ అని తెలిసిపోతుందా..
Krishna Mukunda Murari: కృష్ణ మురారిని అలా చూసినా ముకుందా.? రేపటికి సూపర్ ట్విస్ట్.!
నానమ్మ అప్పుడే వస్తుంది.. ఏమైందమ్మా అంటే చూడు డెకరేషన్ వాళ్ళు ఇంక టైమ్ పడుతుంది అంటున్నారు.. లెట్ అవుతుంది.. పద్మావతి ఉంటే అన్ని తానే చూసుకొనేది.. ఇంక రాలేదు తను అనగానే పద్మావతి రెడీగా వస్తుంది.. ఏందీ ఇదంతా అంటే నాకు గుర్తుకు వచ్చినవి తీసుకొని వచ్చిన.. ఇంకేమైనా ఉంటే చెప్పండి వెంటనే తీసుకొస్తాను అంటుంది.. డెకరేషన్ వాళ్ళు ఇంకా రాలేదు.. ఆగండి నేను కాల్ చేస్తాను అని పద్మావతి సిగ్నల్ లేదని బయటకు వెళ్తుంది.. అప్పుడే వాటర్ పైపు తగిలి కింద పడుతుంది.. దూడ్లు ఉండేవాళ్ళు ఇంతే అని పైపు పైకి తీస్తుంది అప్పుడే విక్కీ వస్తారు.. సారూ జరగండి ఇవి ఆగడం లేదు అని మొత్తం తడిపేస్తుంది.. నన్నే తడిపేస్తావా అంటూ విక్కీ కూడా పద్మావతిని తడిపేస్తాడు.. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అరవింద పద్మావతి ఉంటే ఎలాంటి పనైనా అయిపోతుంది..అన్ని దగ్గరుండి చూసుకుంటుంది.. అనగానే కృష్ణ అందుకే కదా రాణమ్మ పద్మావతిని ఇష్టపడుతున్న అంటాడు.. అందరు షాక్ అవుతారు.. ఏం జరుగుతుంది తర్వాత ఎపిసోడ్ లో చూడాలి..