NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: కావేరి బంటి ఒరేయ్ బంటిగా ఎక్కడున్నావు ఇలా రా అని పిలుస్తుంది.ఆశ బంటి అనే పేరు వినబడి అక్కడే నిలబడి ఏంటి బంటి యా బంటి అనే పేరు ఇక్కడ ఊర్లో ఎవరికి ఉంటుంది చూద్దాం అంటూ వెనక్కి వెళ్లి కిటికీ దగ్గర నుండి రూము లోపలికి చూస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించక పోవడంతో ఆశ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చరణ్ రాజు వాళ్ళు ఆశను వెంబడిస్తూ అంత వెతుకుతారు కానీ ఆశ వాళ్ళకి ఎక్కడా కనిపించదు తప్పించుకుని వెళ్ళిపోయింది అనుకుని తిరిగి వెళ్ళిపోతారు. శాంభవి ఒరేయ్ చరణ్ రాజ్ ఆ పిల్ల దొరికిందా అని అడుగుతుంది చరణ్ రాజు లేదమ్మా తప్పించుకుంది అంతా వెతికాము కానీ ఎక్కడ కనిపించలేదు తప్పించుకుని వెళ్ళిపోయినట్టుంది అని చెబుతాడు శాంభవి ఏ లాయర్ నువ్వు ఏం మనిషివయ్యా కిడ్నాప్ చేశాను తీసుకొస్తున్నాను

Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights
Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights

అని కోతలు కోసావు కదా ఏది ఇప్పుడు ఆపిల్ల ఏది అని అడుగుతుంది. ఆ ట్రస్ట్ మెంబర్ అమ్మ నేను జాగ్రత్తగానే తీసుకువచ్చాను ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా చూశాను తను కారులోనే ఉంది కానీ ఎలా తప్పించుకుందో అర్థం కావడం లేదు అంటాడు చరణ్ రాజ్ ఇదిగో నీ పక్కన ఉన్న ఇతను చాలా తెలివిగా తనని కాపలా కాశాడు అనుకుంటా అందుకే తప్పించుకొని వెళ్ళిపోయింది అంటాడు. శాంభవి సరే ఈసారి మాత్రం ఆ పిల్ల ఎక్కడ ఉన్నా సరే వెతికి జాగ్రత్తగా నాకు అప్పగించడమే నీ బాధ్యత వెళ్ళు ఆ పిల్ల ఎక్కడ ఉందో ఏంటో ముందు అంత వెతికి ఆ పిల్లని పట్టుకుని తీసుకురా వెళ్ళు అంటుంది. ట్రస్ట్ మెంబర్ అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights
Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights

కట్ చేస్తే కావేరి ఒరేయ్ తమ్ముడు ఇదిగో మా బట్టలు సర్దేసుకున్నాము ఇక ఇకనుండి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది అరుణ్ కుమార్ అక్క ఏంటి నీకు అంత తొందర అసలు అంజలి వస్తేనే కదా ఏం చేయాలో నిర్ణయం తీసుకునేది ఇప్పుడే వెళ్లి పోదామంటే ఎలా అని అంటాడు అమృత అయినా ఏంటి వదిన తప్పంతా మాదే అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంది కావేరి ఆహా అలాగా రైలు బోగీలో నిలబడడానికి చోటే లేదంటే చేతులో ట్రంకు పెటే కూడానా అన్నట్టు అంజలి బంటి భార్యాభర్తలని చెప్పడానికి నువ్వు ఆ జై చంద్ర గారి వారసురాలు అని ప్రకటించడానికి దానికి దీనికి లింకు పెట్టిన అందుకే కదా ఆ శాంభవి గారు మన పీక కత్తి పెట్టినట్టుగా సంజయ్ కి అంజలి కి పెళ్లి చేస్తానని ప్రకటన ఇచ్చేసింది కదా ఇంకేం కావాలి అంటుంది కావేరి. అరుణ్ కుమార్ అక్క మనలో మనం ఇలా అరుచుకోవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి అంటాడు. కావేరి ఒరేయ్ తమ్ముడు మీ అంజలి గాని ఆ సంజయ్ తో పెళ్లికి ఒప్పుకుంది అనుకో నేను కుండ బద్దలు కొట్టినట్టుగా నిజం చెప్పేస్తాను తాళి కట్టిన వాడు ఒకటైతే ఒకటైతే కాపురం చేసేవాడు మరొకడు అన్నట్టు ఉంది ఈ వ్యవహారం అంటుంది కావేరి. అరుణ్ కుమార్ అక్క కాసేపు సైలెంట్ గా ఉంటావా అంజలి వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights
Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights

కట్ చేస్తే అంజలి రానే వస్తుంది అమృత అదిగో అంజలి మాటల్లోనే వచ్చింది అంటుంది. అంజలి ఏంటి అందరూ చాలా కోపంగా ఉన్నట్టున్నారు అని అడుగుతుంది. కావేరి కాకపోతే ఏంటి మరి నీకు అమృతకు లింకులు పెట్టడం బాగా అలవాటు కదా మీరిద్దరూ భార్యాభర్తలు అనేవి ఆ శాంభవి గారికి చెప్పకుండా అమృత నే జయచంద్ర గారి వారసురాలని ప్రకటించడానికి లింకు పెట్టారు కదా ఇప్పుడు ఇంకేం ఉంది ఏమీ లేదు తట్ట బుట్ట సదురుకొని ఇకనుండి వెళ్ళిపోవాల్సిందే అంటుంది కావేరి. అంజలి ప్లీజ్ అత్తయ్య కాస్త నేను చెప్పేది వింటారా అని అడుగుతుంది కావేరి ఏంటి నువ్వు చెప్పేది ఆ సంజయ్ తో పెళ్లికి ఒప్పుకున్నాను అనే కదా నువ్వు చెబుతావు అంటుంది

Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights
Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights

అంజలి అవునత్తయ్య నిజంగానే నేను సంజయ్ తో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది ఆ మాటకు అందరూ షాక్ అవుతారు బంటి ఏంటంజలి అంటే నువ్వు సంజయ్ తో పెళ్లి పీటలు మీద పెళ్లికూతురులాగా కూర్చొని నువ్వు సంజయ్ తో పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అది జరగని పని నేను నిజం చెప్పేస్తాను అంటాడు బంటి. అంజలి అబ్బా ప్లీజ్ నేను చెప్పేది కాస్త వింటారా నేను సంజయ్ తో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని అన్నాను కానీ సంజయ్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు కదా ఈ ఒప్పుకుంటున్నాను అని ఆ శాంభవి గారికి చెప్పి ఇంతలోపు ఆస్తి మొత్తం నా పేరు మీదికి రాయించుకొని ఆ తర్వాత మా అమ్మ అమృతనే ఆ జై చంద్ర గారి వారసురాలని చెప్పేసేద్దాం తరువాత అప్పుడు ఆ శాంభవి గారు ఎదురు తిరిగిన తను మనల్ని ఏమీ చెయ్యలేదు

Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights
Kumkuma Puvvu Today Episode April 16 2024 Episode 2156 highlights

అప్పుడు ఏం చేయాలో అంతా నాకు తెలుసు అప్పటివరకు మీరు కాస్త ఓపిగ్గా ఉండండి లేదంటే ఆ శాంభవి గారితో ఇప్పుడు మనం తలపడలేము ఆవిడది స్థాన బలం ఆవిడతో గొడవ పెట్టుకుని మనం ఇక్కడ ఉండలేము అలాగని బయటికి వెళ్ళాము అనుకో ఆ యుగంధర్ చేతుల్లో చిక్కక తప్పదు అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటుంది అంజలి. చంద్రం అవును కావేరి అంజలి చెప్పేది కూడా నిజమే చూద్దాం ఇంకోన్నాళ్ళు ఈ నాటకాన్ని ఇలాగే సాగిద్దాం అని అంటాడు. కావేరి సరే సరిపోయింది సక్కదనం ఇంకా చేసేదేముంది కానివ్వండి అంటుంది

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri