మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది.
`సర్కారు వారి పాట` హిట్ అనంతరం మహేశ్ బాబు నుండి రాబోతున్న చిత్రమిది. అయితే ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం అవుతుందని ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో `ఎస్ఎస్ఎమ్బీ 28` ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్లుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తరుణంలో.. మహేశ్ సతీమణి సమ్రత సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది.
షూట్ డే అంటూ మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను నమ్రత షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు త్రివిక్రమ్-మహేశ్ మూవీ స్టార్ట్ అయిందంటూ తెగ సంభరపడిపోతున్నారు. అయితే మరోవైపు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా ఓ పిక్ ను పోస్ట్ చేశారు. ఇందులో ఆయన హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా హ్యాండ్సమ్ లుక్‌లో దర్శనమిచ్చారు.
పైగా నమ్రత షేర్ చేసిన షూట్ డే పిక్లోనూ మహేశ్ లుక్ సేమ్ టు సేమ్ ఉంది. దాంతో మహేశ్ బాబు వదిలిన న్యూలుక్ త్రివిక్రమ్ చిత్రంలోనిదేనని అభిమానులు అభిప్రయపడుతున్నారు. మరి ఇది నిజమైతే మహేశ్ మరోసారి తన లుక్‌తో తెరపై మిస్మరైజ్ చేయడం ఖాయమవుతుంది.
Loving the new vibe… 😎@jatinkampani @AalimHakim #AnishaJain #NamrataShirodkar pic.twitter.com/g6MZ23DzcP
— Mahesh Babu (@urstrulyMahesh) August 14, 2022