Gaami OTT Response: విశ్వక్సేన్ తాజాగా నటించిన ” గామి ” మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవల ఈ మూవీ ఓటిటిలో రికార్డ్ వ్యూస్ తో అదరగొడుతుంది. నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ 72 గంటల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలో ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ ను దక్కించుకున్న మూవీగా గామి నిలిచింది. ఈ మూవీలో విశ్వక్సేన్ అగోర పాత్రలో కనిపించాడు. అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీతో విద్యాధర్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.
మార్చ్ 8న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ హిట్గా నిలిచింది. విశ్వక్సేన్ యాక్టింగ్ తో పాటు కథ, కథానాలు, టెక్నికల్ వాల్యూస్ అద్భుతం అంటూ ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంది. ఈ మూవీ షూటింగ్ ఆరేళ్లపాటు సాగడం విశేషం. 2018లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. 2024లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ ఏప్రియల్ 12న జీ5 లో గామి మూవీ ఓటీటి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూడు కథలతో దర్శకుడు విద్యాధర్ ఈ మూవీని తెరకెక్కించాడు. శంకర్ (విశ్వక్సేన్) ఓ అఘోరా. అతడిని ఎవరైనా తాకిన వెంటనే శరీరంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
శంకర్ తో పాటు అతడిని తాకిన వారికి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. త్రివేణి పర్వతంపై 36 ఏళ్లకు ఒకసారి పూసే మాలిపత్రి అనే ఔషద మొక్క మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అని శంకర్ తెలుసుకుంటాడు. ఈ మొక్క కోసం హిమాలయాలకు ప్రయాణం మొదలు పెడతాడు. దుర్గ (అభినయ) ఓ దేవదాసి. తన కూతురు ఉమాను(హారిక) కూడా దేవదాసి వ్యత్తి లోకి తీసుకురావాలని అనుకుంటుంది. కానీ ఉమా దేవదాసి వృత్తి కి సెట్ కాదని తెలుస్తుంది. ఇండియా, చైనా బోర్డర్ లోని ఓ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో ఓ యువకుడు (సీ333) బందీగా ఉంటాడు. ప్రయోగాల పేరుతో అతడిని చిత్రహింసలకు గురిచేస్తారు.
శంకర్ కు ఉమా తో పాటు రీసెర్చ్ సెంటర్లో బందీగా ఉన్న సంబంధం ఏమిటి? హిమాలయాలకు చేరుకునే గ్రామంలో శంకర్ ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు? శంకర్ వెంట హిమాలయాలకు బయలుదేరిన జాహ్నవి ఎవరు? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇక ఈ మూవీ తీసేందుకు దర్శకుడు మరియు యాక్టర్స్ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లోనే కాదు ఓటీడీలో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇక విశ్వక్సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మూవీగా కూడా రికార్డ్ సంపాదించుకుంది ఈ మూవీ. నిజానికి ఈ మూవీ పై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్లతో హైబ్స్ క్రియేట్ చేశారు. ఇక హైప్స్ కి తగిన న్యాయం చేస్తూ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలో తన హవా నిరూపించుకుంటుంది.