Dune Part 2 OTT: ఈ ఏడాది హాలీవుడ్లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ” డ్యూన్ పార్ట్ 2 ” కూడా ఒకటి. 190 (1500 కోట్లు) మిలియన్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 685 కోట్ల (4500 కోట్లు) వరకు కలెక్షన్స్ను రాబట్టింది. 2024లో హాలీవుడ్లో హైయెస్ట్ గ్రసింగ్ మూవీస్ లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. థియేటర్లలో వసూళ్లు వర్షం కురిపించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఏక అమెజాన్ ప్రైమ్ తో పాటు బుక్ మై షో ఓ టి టి లోను రెంటల్ విధానంలో ఈ మూవీ రిలీజ్ అయింది.
డ్యూన్ పార్ట్ 2 ను ఓటీటీలో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా 499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీ స్ట్రీమింగ్ వారం తరువాత ఉండబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు రెండు నెలల అనంతరం ఓటీటీలోకి వచ్చింది. డ్యూన్ పార్ట్ 2 మూవీకి డెన్నిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించాడు. టిమోథీ ఛాల్మెట్, జెండాయా, రెబెకా ఫెర్యూసన్, అస్టీన్ బట్లర్ కీలక పాత్రలు పోషించింది. 2021లో రిలీజ్ అయిన డ్యూన్ పార్ట్ వన్ మూవీ ఆరు ఆస్కార్ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, సౌండ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిజైన్తో పాటు మరో మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది ఈ మూవీ.
ఇంటర్నేషనల్ వైడ్ గా అనేక అవార్డులను అందుకుంది. ఈ మూవీ యొక్క మొదటి భాగం విజయం సాధించడంతో డ్యున్ పార్ట్ 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్లుగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీకి పార్ట్ 3 కూడా రాబోతుంది. ఈ సినిమా ఒక్క మూడవ భాగం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. డ్యూన్ కథను విజువల్ వండర్ గా దర్శకుడు విల్లెనెయువ్ తెరకెక్కించాడు. పదివేల సంవత్సరాల అనంతరం జరిగే కథతో గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ తో ఈ కథ సాగుతుంది. ఓ నాలుగు ప్లానెట్స్ మధ్య జరిగే. ఎట్రాడీస్ వంశాన్ని నాశనం చేసిన శత్రువులపై పోల్ అనే యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనే కథనే ఈ మూవీ.
ఇక ఈ మూవీ మొదటి భాగం అండ్ రెండవ భాగం కూడా మంచి విజయం అందుకున్నాయి. మరి ఈ మూవీ నుంచి రాబోతున్న మూడవ భాగం ఏ విధమైన హిట్ అవుతుందో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సంపాదించుకుంది. ఫస్ట్ పార్ట్ లో పోల్ తల్లిదండ్రులను చంపడం వరకే దర్శకుడు చూపించాడు. ఇక సెకండ్ పార్ట్ లో రివెంజ్ ను చూపించాడు. జూన్ మాత్రం డ్రామా తో సాగగా. డ్యూన్ పార్ట్ 2 లో మాత్రం యాక్షన్ అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు డైరెక్టర్. మరి డ్యూన్ పార్ట్ 3 లో ఎటువంటి కథనాలను చూపిస్తాడో చూడాలి.