Pranitha Subhash: ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బెంగళూరులో ప్రణీత జన్మించింది. ఆమె తల్లిదండ్రులు వైద్యరంగంలో సత్తా చాటుతున్నారు. బెంగళూరులో సొంతంగా ఒక హాస్పిటల్ ను కూడా నడుపుతున్నారు. అయితే ప్రణీత మాత్రం తన తల్లిదండ్రుల బాటలో కాకుండా సినిమా రంగం వైపు అడుగులు వేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ లోకి ప్రవేశించిన ప్రణీత.. 2010లో పోర్కి అనే కన్నడ మూవీ తో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టింది. తెలుగు ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి కి ఇది రీమేక్. కన్నడలో దర్శన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ప్రణీతకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
అలాగే బావ మూవీ తో తెలుగులోకి, ఉదయం సినిమాతో తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో ప్రణీతకు సెకండ్ హీరోయిన్ రూల్సే ఎక్కువగా వచ్చాయి. బావ అనంతరం తెలుగులో ప్రణీత అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం తదితర చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో రాని స్టార్డమ్ ప్రణీతకు కన్నడలో వచ్చింది. ఇప్పటికే తన సొంత పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. ఒక హాస్పిటాలిటీ కంపెనీలో ప్రణీతకు వాటాలు ఉన్నాయి. బెంగుళూరులోని లావెల్లే రోడ్లో బూట్‌లెగర్ అనే రెస్టారెంట్‌కు ఆమె సహ-యజమానిగా ఉన్నారు. మరోవైపు అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎందరో పేద ప్రజలకు ప్రణీత అండగా నిలబడుతుంది.
ఇక ప్రణీత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకుంది. కరోనా కారణంగా ఓ రిసార్ట్ లో గుట్టు చప్పుడు కాకుండా ప్రణీత, నితిన్ రాజు పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరు అయ్యారు. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన నితిన్ రాజు.. బెంగళూరులో బ్లూ హారిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
వివాహం అయిన ఏడాదికే ప్రణీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తమ గారాల పట్టికి ప్రణీత దంపతులు అర్నా అని నామకరణం చేశారు. ప్రస్తుతం అర్నా వయసు రెండేళ్లు. ఈ చిన్నారి అందం విషయంలో తన తల్లి ప్రణీతను మించిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అర్నా ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోను ప్రణీత ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అర్నా ఫోటోను చూసిన నెటిజన్లు జూనియర్ ప్రణీత చాలా ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పెళ్లై కూతురు పుట్టినా కూడా ప్రణీత వరుసగా సినిమాల్లో నటిస్తోంది. గ్లామర్ షో పరంగా కూడా తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్లతో అభిమానులను, సినీ ప్రేక్షకులను కనులవిందు చేస్తోంది.