Ranbir Kapoor-Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కొద్ది రోజుల క్రితం ప్రేయసి, స్టార్ హీరోయిన్ అలియా భట్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా ఈ లవ్ బర్డ్స్ ఒకటయ్యారు. అయితే వివాహం తర్వాత రణ్‌బీర్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే సినిమాలతో బిజీగా అయిపోయాడు.
ప్రస్తుతం ఈయన రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అందులో ఒకటి `బ్రహ్మాస్త్ర`. భార్య అలియా భట్‌తో కలిసి నటించిన ఈ చిత్రం రిలీజ్‌కు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఆలోపే రణ్‌బీర్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయిన `షంషేరా` ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో వాణీ కపూర్ హీరోయిన్గా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. జూలై 22న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. తాజాగా రణ్‌బీర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న ఆయన.. నా మొదటి భార్య అలియా కాదంటూ షాకింగ్ నిజాన్ని బయటపట్టాడు.
రణ్‌బీర్ మాట్లాడుతూ.. `గతంలో నేను మా పేరెంట్స్‌తో కలిసి కృష్ణరాజ్ బంగ్లాలో ఉండేవాడిని. అప్పుడో అమ్మాయి వచ్చి మా ఇంటి గేట్‌ను పెళ్లాడింది. గేటుకు పూలదండ వేసి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు చల్లి.. ఇక నాకూ తనకు పెళ్లయిపోయినట్లేనని ఆనందించి అక్కడినుంచి వెళ్లిపోయిందట. నేను ఇంటికి రాగానే మా వాచ్మెన్ ఈ విషయం చెప్పాడు. అది నాకు చాలా క్రేజీగా అనిపించింది. అయితే నా మొదటి భార్యను నేనింకా కలవాల్సి ఉంది` అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.