Guntur Kaaram: సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సినిమా “గుంటూరు కారం” రిలీజ్ కావటం తెలిసిందే. జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మిక్సడ్ టాక్ రావడం జరిగింది. త్రివిక్రమ్ పనితనం ఏమీ బాగోలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలో డైలాగులు కూడా పెద్దగా ఏమీ లేవని విమర్శిస్తున్నారు. అతడు, ఖలేజాలో ఉన్న ఆ నిండుతనం ఈ సినిమాలో లేదని మహేష్ పాత్ర పాటలు హీరో హీరోయిన్ డాన్స్ తప్ప సినిమాలో విషయం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీలకి “గుంటూరు కారం” ఫలితంతో.. తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లోనే ఓవర్ నైట్ లో… అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీలీల… బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు అందుకోవటం జరిగింది.
2021లో “పెళ్లి సందD” సినిమాతో ఇండస్ట్రియల్ అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన అవకాశం అందుకుంది. అయితే అవకాశాలు వస్తున్నా గానీ ఈమె నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం మైనస్ గా మారింది. ఈమె నటిస్తున్న సినిమాలు పరాజయం అవుతున్నాయని చాలామంది ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇదే రకంగా పూజ హెగ్డే కూడా.. ప్రారంభంలో వరుస విజయాలు అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో చాలామందికి లక్కీ హీరోయిన్ గా కూడా మారిపోయింది. కానీ కరోనా తర్వాత పూజ హెగ్డే నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఆమె చేసిన సినిమాల ఫలితాలు దెబ్బకి లక్కీ హీరోయిన్ కాస్త ఐరన్ లెగ్ అనే ముద్ర పడటం జరిగింది. మహేష్ “గుంటూరు కారం” సినిమా పరాజయం పాలు కావడంతో.. శ్రీ లీలకి కూడా ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఐరన్ లెగ్ గాని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి గుంటూరు కారం స్టార్టింగ్ లో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డేనీ తీసుకోవడం జరిగింది. మహేష్ పూజ హెగ్డే మధ్య కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ ప్రాజెక్టు మధ్యలో నుండి పూజ హెగ్డే డ్రాప్ అయింది. ఆ తర్వాత శ్రీ లీలనీ తీసుకోవడం జరిగింది. “గుంటూరు కారం” నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” పైనే శ్రీలీల ఆశలు పెట్టుకోవడం జరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్ తర్వాత రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!