మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూనే.. ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో తమన్నా డాన్స్ హైలెట్‌గా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలో రీసెంట్ గా `వేటా క్రియేటర్స్ డే` ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్ళిన తమన్నా.. రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా మెరిసిపోతూ అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
అంతేకాదు, అక్కడ అభిమానుల మధ్య విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన `మాస్టర్` సినిమాలో `వాతీ కమింగ్` సాంగ్ కు మాస్ స్టెప్పులు వేసి మిల్కీ బ్యూటీ అదరగొట్టింది. తమన్నా డాన్స్ కు ఫ్యాన్స్ సైతం షేక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `భోళా శంకర్` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే సత్యదేవ్‌తో ఈమె నటించిన `గుర్తుందా శీతాకాలం` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక బాలీవుడ్‌లోనూ తమన్నా పలు ప్రాజెక్ట్స్‌లో భాగమైంది.
.@tamannaahspeaks Vibes for #vaathicoming at #Metacreatorday event at Chennai. pic.twitter.com/lPuZn7ON4F
— Abєєѕ (@AbeesVJ) October 27, 2022