టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజా చిత్రం `ది వారియర్`. తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్‌గా చేశారు. నదియా, అక్షర గౌడ తదతరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
భారీ అంచనాల నడుమ నిన్న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ దక్కించుకుంది. టాక్ బాగుండటం, పోటీగా ఈ సినిమా లేకపోవడంతో.. రామ్ తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 7.02 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ. 8.02 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. ఇక ఏరియాల వారీగా `ది వారియర్` ఫస్ట్ డే కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నైజాం- రూ. 1.95 కోట్లు
సీడెడ్- రూ. 1.06 కోట్లు
యూఏ- రూ. 1.02 కోట్లు
తూర్పు- రూ. 0.51 కోట్లు
వెస్ట్ : రూ- 0.67 కోట్లు
గుంటూరు- రూ. 1.19 కోట్లు
కృష్ణా- రూ. 0.33 కోట్లు
నెల్లూరు- రూ. 0.29 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ= రూ. 7.02 కోట్ల(రూ.10.20~ గ్రాస్)
—————————-
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా: రూ. 0.40 కోట్లు
ఓవర్సీస్- రూ. 0.30 కోట్లు
తమిళ వర్షన్- రూ. 0.30కోట్లు
————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ. 8.02 కోట్లు(రూ.12.20కోట్లు~ గ్రాస్)
————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రేపు రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగితోంది. దీంతో ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ అవ్వాలంటే.. తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రామ్ ఇంకా రూ. 30.98 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.