టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి, `ది వారియర్` వంటి ఫ్లాప్ తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్9గా శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే నేడు దసరా పండుగ సందర్భంగా ఈ మూవీపై మేకర్స్ ఏకంగా మూడు క్రేజ్ అప్డేట్స్ను బయటకు వదిలారు.
అందులో మొదటిది ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీలను రామ్ పోతినేనికి జోడీగా కన్ఫమ్ చేశారు. శ్రీలీలకు అషీషియల్ గా వెల్కమ్ చెబుతూ.. ట్విట్ చేశారు. అలాగే మరో అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్షేసన్ తమన్‌ను ఖాయం చేసుకున్నారు.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. రేపటి నుంచి అంటే అక్టోబర్ 6వ తేదీన ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు, తొలి రోజే హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో షూటింగ్ ను ప్రారంభించబోతున్నామని కూడా మేకర్స్ వెల్లడించారు. మొత్తంగా మూడు క్రేజీ అప్డేట్స్ ఇవ్వడంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
Delighted to Welcome Onboard the Most Beautiful and Talented Actress @sreeleela14 for #BoyapatiRAPO 💃🤩✨@ramsayz #BoyapatiSreenu @SS_Screens @srinivasaaoffl pic.twitter.com/cr4NJqcDvN
— Srinivasaa Silver Screen (@SS_Screens) October 5, 2022
On this auspicious day of Dussehra, We are super excited to announce 📢
The Massive Energetic Combo of Ustaad @ramsayz and Mass Director #BoyapatiSreenu on sets from Tomorrow 🔥⚡#BoyapatiRAPO starts rolling with High Adrenaline Action Sequence 🎥🎬 pic.twitter.com/ooQk3ICmYv
— Srinivasaa Silver Screen (@SS_Screens) October 5, 2022
https://newsorbit.com/entertainment-news/ram-pothineni-boyapati-srinu-movie-shooting-update.html