Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” విత్ NBK కి సంబంధించి ఆహా ఓటీటీ అధికారిక ప్రకటన తాజాగా చేయడం జరిగింది. పండుగ త్వరలో ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలి అని ఆహా ట్వీట్ చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా ఫస్ట్ టైం “అన్ స్టాపబుల్” విత్ NBK షో ఆహా ప్లాన్ చెయ్యగా ఫస్ట్ సీజన్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ బాలయ్య ఈ షోలో చేసిన కామెడీ అందించిన ఎంటర్టైన్మెంట్ అప్పట్లో “ఆహా” ఎదగటానికి మరింత సహాయపడింది.
ఒక విధంగా చెప్పాలంటే కరోనా లాంటి కష్ట కాలంలో ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా ఓటీటిలు గట్టిగా పునాదులు వేసుకుంటున్న సమయంలో “ఆహా” అప్పుడే లాంచ్ అయ్యింది. ఆ సమయంలోనే బాలకృష్ణతో “ఆహా” యాజమాన్యం.. ప్లాన్ చేసిన ఈ టాకీషో దేశంలోనే సంచలనం సృష్టించింది. అత్యధిక వ్యూస్ తో ఓటిటి రంగాలలో అత్యధికంగా చూస్తున్న షోగా “అన్ స్టాపబుల్” దూసుకుపోయింది. కాంట్రవర్సీ ప్రశ్నలను కామెడీ రూపంలో అడుగుతూ… అద్భుతమైన జవాబులు అవతల వాళ్ళ నుండి రాబడుతూ బాలయ్య తనదైన శైలిలో హోస్ట్ గా రాణించారు.
వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై కూడా తనకు తిరుగు లేదని “అన్ స్టాపబుల్” విత్ NBK షో ద్వారా రుజువు చేశారు. మొదటి సీజన్ లో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, రవితేజ, గోపీచంద్ మలినేని, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, చార్మి, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, మోహన్ బాబు, మంచు విష్ణు, అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్… తదితరులు పాల్గొనడం జరిగింది. మరి త్వరలో స్టార్ట్ కాబోయే రెండో సీజన్ లో ఎవరు వస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దసరా సీజన్ కి ముందుగానే “అన్ స్టాపబుల్ 2” విత్ NBK షో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం బాలకృష్ణ “NBK 107″ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి షెడ్యూల్ టర్కీలో జరుగుతుంది. టర్కీ షెడ్యూల్ అయిన వెంటనే..”అన్ స్టాపబుల్ 2” షోలో బాలయ్య పాల్గొననున్నట్లు సమాచారం.