Varun Tej:మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. `ముకుంద` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా `ఫిదా`తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ మెగా ప్రిన్స్.. ఇటీవలె `గని`, `ఎఫ్ 3` చిత్రాలతో పలకరించాడు.
బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న `గని` బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఫస్ట్ ఎంటర్టైనర్గా వచ్చిన `ఎఫ్ 3` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో వరుస హట్ చిత్రాలను ఖాతాలో వేసుకునేందుకు వరుణ్ తేజ్ కొత్త రూట్‌ను ఎంచుకున్నాడట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. కామెడీకి అధిక ప్రాధాన్యత ఉన్న కథలే ఎంచుకోవాలని వరుణ్ తేజ్ నిశ్చయించుకున్నాడట. ప్రేక్షకులకు ఫన్ అందిస్తే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. అందుకే ఇప్పుడు కామెడీ కథల కోసం చూస్తున్నాడట. ఎవరైనా కథలు చెప్పడానికి వస్తే సీరియస్ కథ ఇప్పట్లో వద్దని, ఫన్ స్టోరీ అయితేనే చెప్పమని అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, వరుణ్ తేజ్ ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీని పట్టాలెక్కించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ.. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.