కంప్యూటరు లేదా లేప్ టాప్ కీబోర్డ్ పైన ఉండే f,j అక్షరాల కింద గీతలు ఉండటం మనం గమనిస్తూనే ఉంటాము. మనం సరిగ్గా గమనించి చూస్తే ప్రతి కీబోర్డ్ కి ఇలానే ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది? దానికి కారణం ఏమిటి? అన్ని అక్షరాలు ఉండగా f ,j మీద మాత్రమే గీతలు ఉండడానికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా.
ఇలా ఉండడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనం ప్రతిసారి కీబోర్డ్ ని చూస్తూ టైప్ చేయలేము. హడావిడిలోనో లేకపోతే పని త్వరగా చేసే సమయం లో దాదాపు మనం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ టైప్ చేస్తూ ఉంటాము. అలా చూడకుండా టైప్ చేసే సమయంలో మన చేతివేళ్లు అటు ఇటూ కదలకుండా ఆ రెండు కీల దగ్గర ఉండటం వల్ల మనం కీ బోర్డ్ లో అక్షరాలను తేలికగా గుర్తు పట్టి త్వరత్వరగా టైప్ చేసేస్తాము .
ఒకసారి మన కీబోర్డు మీద ఉన్న అక్షరాల మీద వేళ్ళు పెట్టి పరిశీలిస్తే కుడివైపు k,l అక్షరాల మీదఉంగరం వేలు చిటికెన వేలు ఉంటాయి. ఎడమవైపు a,s,d అక్షరాల మీద 3 వేళ్ళు ఉంటాయి. టైపింగ్ లో ఉన్న పద్ధతి ప్రకారం ఈ వేళ్ళు ఈ అక్షరాలను మాత్రమే సులభంగా టైప్ చేయగలుగుతాయి. అలా మనం వేగంగా టైప్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చూడకుండా టైప్ చేసినా అక్షరాల క్రమం గుర్తు ఉంటుంది. మిగిలిన వేళ్ళు కూడా ఆటోమేటిక్ గా పక్కన అక్షరాల మీద పడిపోతాయి. అందుకే f j అక్షరాల కింద మాత్రమే గీతలు ఉంటాయి.