Fact Check: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎంత ఉపయోగాలు ఉంటున్నాయో అంతకంటే ఎక్కువగా అనర్ధాలు కూడా ఉంటున్నాయి. ఎప్పటివో పాత వీడియోలను వైరల్ చేస్తూ.. సమాజంలో చిచ్చుపెట్టే రాజకీయ కుట్రలు ఇంకా వర్గాల మధ్య వివాదాలు, కులాల మధ్య గొడవలు పెట్టే నరరూప రాక్షసులు.. ప్రస్తుత రోజుల్లో ఎక్కువైపోయారు. లేనిది ఉన్నట్టుగా సృష్టించి… ప్రజలను రెచ్చగొట్టే రీతిలో.. సున్నితమైన అంశాలైన మతం… జాతి.. కులం వంటి అంశాలను అడ్డం పెట్టుకొని ప్రజలు కొట్టుకుంటూ ఉంటే మరి కొంతమంది నాయకులు కుట్ర దారులు పైశాచిక ఆనందం పొందుతున్నారు.

ఈ తరహా లోనే ఇండియాలో.. ఓ ప్రబుద్ధుడు.. ఓ మహిళపై భౌతికతాడికి పాల్పడిన నిమిషాల వీడియో పోస్ట్ చేసి సంచలన కామెంట్ పెట్టాడు. ముస్లిం అబ్బాయితో పిచ్చి ప్రేమలో ఉన్న ఓ హిందూ మహిళపై దాడి అని.. హెడ్డింగ్ పెట్టి షేర్ చేయడం జరిగింది. కాళీ చరణ్ మహారాజ్ అనే ట్వి ట్విట్టర్ ఎకౌంటు ఖాతాదారుడు.. ఈ పోస్ట్ పెట్టాడు. భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అమాయక హిందూ స్త్రీలు… వేరే మతస్తులతో ప్రేమలో పడి బాధలు పడుతున్నారు. కాబట్టి హిందువుల తల్లిదండ్రుల్లారా మేలుకొనండి. ఈ వీడియోను మీ కుమార్తెలకు చూపించి వివరించండి. తర్వాత ఏడ్చిన ప్రయోజనం ఉండదు. వాళ్లు నరరూప రాక్షసులు. అటువంటి రాక్షసులతో దేవతల కూటమికి పొత్తు ఉండదు.. అంటూ ఈ రీతిగా ముస్లిం మరియు హిందువుల మధ్య గొడవ పెట్టే రీతిలో వీడియో వైరల్ చేశారు.

ఈ క్రమంలో ఫ్యాక్ట్ చెక్.. ఆ వీడియోకి సంబంధించి వస్తున్న కామెంట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. అసలు విషయంలోకి వెళ్తే రష్యాలో ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోవడానికి ప్రయత్నం చేసి చివరకి కుటుంబ సభ్యులకు పట్టుబడింది. ఈ సంఘటన 2021 జూన్ మాసంలో జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడం జరిగింది. ఇండియా ట్విట్టర్ లో ముస్లిం మతస్తుల ప్రేమలో హిందువుల అమ్మాయిలు బలి అంటూ చేస్తున్న… ప్రచారం అవాస్తవమని అది రష్యా దేశానికి చెందిన ఒక కుటుంబానికి సంబంధించిన గొడవ వీడియో. ఆ అమ్మాయి నీ కొడుతున్నది కూడా సొంత కుటుంబ సభ్యులే … అని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేయడం జరిగింది.