ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళను చూసారు కదా… ఆమె కడుపుతో ఉందేమో అని అనుకుంటున్నారు కదా… కానీ ఆమె గర్భవతి కాదు.
కానీ ఎందుకో రోజు ,రోజుకీ ఆమె పొట్ట అమాంతం పెరిగిపోతోంది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. దానిపూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు హువాంగ్ గుక్సియన్. చైనాకి చెందిన ఈ మహిళ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమెకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా హువాంగ్ పొట్ట పెరుగుతూ వస్తోంది. మొదట ఆమె గర్భం దాల్చిందని అనుకున్నారు. కానీ పరీక్ష చేయించుకుంటే.. అలాంటిదేమీ లేదు అని తెలిసింది.
రెండు సంవత్సరాలుగా ఆమె పొట్ట పెరుగుతూ నే ఉంది. అనారోగ్యం కారణంగానే ఆమె పొట్ట అలా పెరిగిపోతోందని ఆలస్యంగా గుర్తించారు. కాగా.. ప్రస్తుతం ఆమె పొట్ట దాదాపు 19 కేజీలు పెరిగిపోయింది. అంటే దాదాపు 44 పౌండ్ల బరువు ఉంది.ఆ భారీ పొట్ట కారణంగా హువాంగ్ కి కనీసం సరిగా నిద్ర పోవడానికి కూడా లేక తీవ్ర అవస్థ పడుతుంది పోనీ పొట్టతోపాటు.. ఆమె శరీరం కూడా పెరుగుతుందా అంటే అదీ లేదు.
కేవలం పొట్టమాత్రమే పెరిగిపోతోంది..కనీసం నడవడానికి కూడా కుదరక.. ఆమె తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఆమె మొత్తం బరువు 121 పౌండ్లు,అందులో 44 పౌండ్లు కేవలం ఆ పొట్టే ఉండటం గమనార్హం.తొలుత ఆమెకు కడుపులో నొప్పి రావడం మొదలైంది. ఆ నొప్పితో ఆస్పత్రిలో చేరితే.. నొప్పి తగ్గడానికి మాత్రం మందులు ఇచ్చారు.
అయితే.. నొప్పి తగ్గినా, ఆమె పొట్ట పెరగడం మాత్రం ఆగలేదు. దీంతో.. ఆమెకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకు చాలా డబ్బులు అవసరం ఉంది.అందుకు తగిన మొత్తం ఆమె వద్ద లేవు. సహాయం కోసం సోషల్ మీడియాలో హువాంగ్ ప్రజలను వేడుకుంటోంది. ఇప్పటివరకు కొంత మంది సహాయం చేశారని ఆమె చెబుతోంది.