ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. దీన్ని తాగడం వల్ల మరింత ఆనందంగా ఫీల్ అవుతారు.
స్వీడన్లోని చామర్స్ యూనివర్సిటీ, యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. పిల్టర్ కాఫీ ఎక్కువగా తాగిన వారికి త్వరగా డయాబెటీస్ కాస్తా దూరమైనట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు బృందాలపై పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి చెబుతున్నారు.
ఈ పరిశోధనలో ఫిల్టర్ కాఫీ ఎక్కువగా తాగిన వారిలో షుగర్ వ్యాధి దూరమైనట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కాఫీలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, మరికొన్ని న్యూట్రియెంట్స్ ఉంటాయి. కాబట్టి, దీనిని రెగ్యులర్గా తాగడం వల్ల షుగర్ వ్యాధికి వ్యతిరేకంగా ఆ మూలకాలు పనిచేస్తాయి. కొన్ని రోజుల పాటు ఫిల్టర్ కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్ 2 డయాబెటీస్ చాలావరకూ డయాబెటీస్ దూరమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎక్కువగా కాఫీ తాగే వారికి షుగర్ దూరం అవుతుంది. ఎందుకంటే కాఫీలో తక్కువ బ్లడ్ షుగర్ పదార్థాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా కాఫీ తాగడం వల్ల మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. ఈ కారణంగా చాలా వరకూ షుగర్ వ్యాధి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారుఅయితే, మంచిది కదా అని అదే పనిగా కాఫీ తాగడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.
దీని వల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి రోజుకి రెండు, మూడు కప్పులకి మించి కాఫీ తాగకూడదు. కాబట్టి రెగ్యులర్ 2 కప్పుల కాఫీ తాగడం వల్ల డయాబెటీస్ ముప్పు 60 శాతం తగ్గినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీ హైడ్రేట్ అవుతుంది కూడా. కాబట్టి రోజుకి, 2, 3 కప్పుల కాఫీ మాత్రమే తాగాలని సూచిస్తున్నారు.