పెద్దగా ఏ పని చేయకపోయినా.. అలసిపోయినట్లు అనిపిస్తోందా ? ఎక్కువ పని చేయకుండానే నీరసంగా మారుతున్నారా..? అయితే మీకు ఐరన్ లోపం ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకోండి. శరీరానికి కావాల్సినంత ఐరన్ మీరు తీసుకునే ఫుడ్ నుంచి మీకు లభించకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇదే కనుక నిజమయితే.. మీరు తొందరగా జాగ్రత్త పడాలి. లేకపోతే మరిన్ని సమస్యలు వచ్చి పడతాయి. అందుకే మన రక్తంలో ఐరన్ శాతం తక్కువ కాకుడదు. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దాంతో అనేక సమస్యలు వస్తాయి. ఈ ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల్లో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం తగ్గుతుంది. దాంతో పలు సమస్యలు వస్తాయి.
అయితే మీకు కనుక ఐరన్ లోపం ఉంటే ఆ సమస్యలు తీర్చే పలు మార్గాలను ఆయుర్వేదం మనకు అందిస్తుంది. ఆ మార్గాలను మీరు పటిస్తే సరి.. ఐరన్ లోపాన్ని అధిగమించొచ్చు. ఆ మార్గాల్లో మొదటిది నల్ల నువ్వులు. ఇందులో ఐరన్ తో పాటు కాపర్, జింక్, సెలేనియం, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. వీటిని వేయించి.. అందులో కొంచెం తేనే, నెయ్యి కలిపి ఒక ఉండలా చేసి రోజు ఒకటి తినాలి. లేకపోతే బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు రెండు లేదా మూడు ఖర్జూర పండ్లు, ఒక చెంచా ఎండు ద్రాక్ష ను తినాలి. అలాగే
బీట్ రూట్ జ్యూస్ ను పొద్దున్నే తాగాలి. అలా తాగితే ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి.
లేవగానే ఉదయం పూట మునగ ఆకుల పౌడర్ ని తినాలి. ఇలా చేస్తే.. రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.ఇందులో ఐరన్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని తెలుపుతున్నారు. మీరు కూడా ఒకసారి వీటిని ట్రైచేసి చూడండి.