మగవారిలో అనేక శృంగారపరమైన సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మగవారిలో శుక్రకణాల కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది అని కొంతమంది నిపుణులు తెలియజేశారు.
మరికొంతమందికి శుక్రకణాల కౌంట్ బాగున్న వారి శుక్రకణం నాణ్యత చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. వీటి అన్నిటి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు, డైట్ ఫాలో అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏ ఆహారం తీసుకోవాలో చూద్దాం.
జింక్, విటమిన్ సీ, విటమిన్ డీ, విటమిన్ బీ12, విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. మునక్కాయల కూర లైంగిక సామర్థ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని, అది వారానికి రెండు మూడు సార్లు తినడం ద్వారా మీ శృంగార జీవితంలో ఎంతో సహకరిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా శుక్రకణాల కౌంట్, నాణ్యత పెరగాలి అంటే ప్రతి రోజూ ఓ గ్లాసు పాలు తీసుకోవడంతోపాటు నానబెట్టిన బాదం పప్పు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. అత్యంత అరుదుగా లభించే బ్రోమెలైన్ ఎంజైమ్ అరటిపండ్లలో ఉంటుంది. ఈ ఎంజైమ్ కూడా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సాయపడుతుంది.
వెల్లుల్లిలో సెలీనియం అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది వీర్యకణాలు పెంచుతుంది.ఎలా చూసినా క్యారట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసే వెజిటబులే. ఇందులో ఉండే బీటా కెరొటిన్ అనే యాంటిఆక్సిడెంట్.. వీర్య కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్లు, చేపలు, పాలకూర, దానిమ్మ పండ్లు వీటివలన శుక్రకణాల అభివృద్ధి తో పాటు నాణ్యత పెరుగుతుంది . వీటితోపాటు నారింజ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.