బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు చల్లని చల్లని వాతావరణంలో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న కండి తింటే వచ్చే మజానే వేరు కదా..చాలా మంది ఈ మొక్కజొన్న కండిలను బాగా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రధాన ఆహార పంటగా మొక్కజొన్నను పండిస్తారు.మొక్కజొన్న కండి ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొక్కజొన్న రుచిలోనే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మొక్కజొన్న కండి తినడం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.మొక్కజొన్నలో మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, జింక్ ,విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా థయామిన్ ,నియాసిన్ అనే పోషకాలు కూడా ఉన్నాయి.ఇవే కాకుండా మొక్కజొన్న కండి తింటే ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
ఎముకలను గట్టి పరచడంలో :
మొక్కజొన్నలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే మొక్కజొన్న కండి తింటే ఎముకలు బలోపేతం అయ్యి గట్టిగా దృడంగా మారతాయి.
గుండె ఆరోగ్యానికి :
మొక్కజొన్న కండి తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి గుండెకు సంబందించిన సమస్యలు రావు.రక్తపోటును తగ్గించి వివిధ గుండె జబ్బులు ,దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది :
మొక్కజొన్న కండి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఫెరులిక్ యాసిడ్ ,ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉన్నందుకు ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపరచడంలో :
మొక్కజొన్న కండిలో ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది.కాబట్టి శరీరంలో అన్ని సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఇది స్టార్చ్ రహిత ,కొవ్వు రహితంగా ఉంటుంది.మలబద్ధకాన్ని నివారించడంలో కూడా బాగా సహాయపడుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.ఇది తిన్న తర్వాత మీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…