అమ్మాయిలు ఎవర్నై నా ఇష్టపడి తే అది వారి శారీరక కదలికల ద్వారా వ్యక్తం చేస్తుంటారు . అది కూడా ఇష్ట పడిన వ్యక్తి కి తప్ప వేరే వాళ్ల కు అర్ధం కాకుండా సంకేతాలిస్తూ జాగ్రత్తపడుతుంటారు. అబ్బాయిలు ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా ?వస్తే సరే .. లేదంటే ఇప్పుడు చెప్పబోయేవి గుర్తుపెట్టుకుని అమ్మాయి మనస్సు తెలుసుకుని మసలుకోండి.
ఎవరైనా అమ్మయి మీతో బాగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే అదొక సంకేతం కావచ్చు. ఎందుకంటే అబ్బాయిని ఓ అమ్మాయి ఇష్టపడిందంటే ఇక ఆ క్షణం నుండి ప్రతి నిమిషం అతనితో మాట్లాడేందుకు, అతని గురించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇష్టమైన అబ్బాయి తో మాట్లాడేటప్పుడు పదే పదే తన జట్టు ను సరి చేసుకుంటున్నా, జుట్టుతో ఆటలాడుతున్నా, ఆమె జుట్టు ను అటు ఇటు కదుపుతున్న, మీరు ఆమెని గమనిస్తున్నారా? లేదా ? ఆమెని కనీసం చూస్తున్నారా లేదా అనేందుకు ఒక సంకేతం.
ఇష్ట పడ్డ అబ్బాయి తో పెదాల తో నే కాదు, కళ్ళతోనూ మాట్లాడేస్తుంది ఆమె . అది వారిద్దరికి మాత్రమే తెలిసిన భాషఅన్నట్టుగా చుట్టూ ఎంతమంది ఉన్న సరే కళ్ల తో నే వారి సంభాషణ సాగిపోతుంది. మనసుకు నచ్చిన అబ్బాయిని ఆకట్టుకోవడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ ఆమె వదులుకోదు. అందుకే అబ్బాయి కనిపించే…అవకాశం ఉన్నప్పుడు… చక్కటి అలంకరణ తో, మంచి దుస్తుల తో మెరిసిపోతూ ప్రత్యక్షం అవుతుంది.
ఆమె మీతో మాట్లాడేటప్పుడు గొంతులో మార్పు వస్తుంది… అంటే అది మీతో ప్రేమకు సంకేతం ఇస్తున్నట్టు. గొంతులో ఎంతో మాధుర్యం వచ్చేస్తుంది. మాటతీరుతోనే మిమ్మల్ని కట్టి పడేయాలని చూస్తుంది. ఇష్టపడిన వ్యక్తి ఎదురుకాగానే అమ్మాయి మొహం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోతుంటుంది.
పెదవులపై వచ్చే చిరునవ్వును అస్సలు ఆపుకోలేదు. దీంతో అబ్బాయి అమ్మాయి మనసును వెంటనే కనిపెట్టేయవచ్చు.ఇక ఒక అమ్మాయి అనుకోకుండా అయినా లేదా ఉద్దేశ్యపూర్వకంగా అయినా మీ చేయి లేదా భుజం పై చేయి వేస్తే, ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందనే దానికి నేరుగా ఇచ్చే సంకేతం.. ఇప్పుడు ఆలోచించండి ఇంతక ముందు ఇలాంటివి ఏమైనా జరిగాయా అని …