భార్యభర్తల మధ్య బంధం బలపడాలంటే.. వారి సెక్స్ వల్ లైఫ్ కూడా అంతే అందంగా, ఆనందంగా ఉండాలి. అయితే.. ప్రస్తుత కాలంలో అందరూ సమయం వెంట పరిగెడుతున్నారు.
దీంతో పని ఒత్తిడి కారణంగా సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కొందరు చాలా వరకు ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. మరి కొందరేమో లైఫ్ పార్టనర్ ఇష్టం లేదనో, ఇంకేదే ఇంకేదో కారణంతోనే సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. దాంపత్య జీవితంలో శృంగారానిదే పెద్దపీట.
అయితే.. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పటి దంపతులు శృంగార జీవితాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారట. భార్యల కారణంగా భర్తలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారట. భార్య భర్త ల మీద జరిగిన ఓ సర్వే బాంబ్ పేల్చింది. అది ఏమిటంటే భర్తలను చాలా మంది భార్యలు మోసం చేస్తున్నారని తెలిపింది.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాన్ని పాడు చేసుకుంటున్నారని స్పష్టం చేసింది.
సగం మంది పెళ్లైన మహిళలు తమ భర్తలను మోసం చేస్తూ, వేరొకరితో సంబంధం పెట్టుకుంటున్నారని వివరించింది.బ్రిటన్‌లోని ఇన్ డెప్త్ సెక్స్ అండ్ రిలేషన్షిప్ సర్వే ప్రకారం.. 40 శాతం మంది మహిళలు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. 47 శాతం మంది తమ పార్ట్నర్స్, భర్తలతో నిజాయితీగా ఉండటం లేదట.
దాదాపు వెయ్యి మంది మహిళలను సర్వే చేయగా ఈ దారుణ విషయం వెల్లడైంది. ఇలా.. మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి కారణాలను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. భర్తలు ఎక్కువ ఆఫీస్ పనిలోనే నిమగ్నం అవ్వడం, తన భావాలను పంచుకోవడానికి సమయం కేటాయించకపోవడం, పొద్దస్తమానం జాబ్ గురించే ఆలోచించడం, ఎక్కువగా మద్యం సేవించడం.. తదితర కారణాలను వెల్లడించారు.
వివాహ బంధంలో ఆనందం లేకపోయినా, భాగస్వామి నచ్చకపోయినా.. తాము ఫ్రెండ్ తో గానీ, తోటి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నామని 27 శాతం మంది పురుషులు, 15 శాతం మంది మహిళలు తెలిపారు. ఇక.. బాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని 17 శాతం మంది కోరుకుంటున్నారట.
తాము తమ భర్తల్ని మోసం చేస్తూ, వేరొకరితో సంబంధం పెట్టుకున్నామని 39 శాతం మంది మహిళలు తెలిపారు.పిల్లలు పుట్టాక వివాహేతర సంబంధం పెట్టుకున్నామని మెజారిటీ మహిళలు వెల్లడించారని సర్వే పేర్కొంది.మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యభర్తల మధ్య అన్యోన్యత కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. అభిప్రాయాలు, అభిరుచులు ఒకరినొకరు పంచుకుంటూ చిలకాగోరింకల్లా కలిసిమెలిసి అన్యోన్యత, ప్రేమానురాగాలుపంచుకోవాలి.
పిల్లలు, అవసరాలుఇలా బాధ్యతలుపెరిగే కొద్దీ భార్యభర్తల మధ్య అన్యోన్యతకు కాస్త దూరం పెరుగుంది. ఒత్తిడి, రకరకాల పనుల కారణంగా.. ఇద్దరూ ఒంటరిగా గడపడానికి సమయం దొరకదు. దీంతో విబేధాలకు దారితీయచ్చు. కాబట్టి.. ఎలాంటి అవసరాలు వచ్చినా.. ఎన్ని పనులు భుజానికేసుకున్నా.. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు కొరత రాకుండా చూసుకోవాలి .మనస్సు విప్పి కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి . అప్పుడే మీకు పెళ్లై ఎన్ని ఏళ్లైనా.. కొత్త జంటలా కనిపిస్తారు.
అంతెందుకు దంపతుల మధ్య ఏవైనా చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా..వాటిని శృంగారమే దూరం చేస్తుంది. అంతటి శక్తి దానికుంది. అంతేకానీ.. చిన్నపాటి గొడవలకు సెక్స్ వల్ లైఫ్ ని దూరం చేసుకొని సమస్యలు కొని తెచ్చుకోకండి అని సూచిస్తున్నారు నిపుణులు.