సోషల్ మీడియాలో సంసారం చేస్తున్న జంటలు!!

భార్యభర్తల మధ్య ప్రేమ ఉంటే వారి జీవితం తో పాటు శృంగార జీవితం కూడా అద్భుతం గా , ఆనందంగా ఉంటుంది. అయితే… ప్రస్తుత కాలంలో దంపతులు తమ వ్యక్తిగత  విషయాలకు కూడా సమయం కేటాయించుకోలేక పోతున్నారట. స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది.

సోషల్ మీడియాలో సంసారం చేస్తున్న జంటలు!!

అయితే, గత ఇరవై ఏళ్లుగా స్త్రీ, పురుషుల మధ్య శృంగార కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయట. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా కావడం గమనించవలిసిన విషయం ….వయసు రాగానే ప్రేమ, పెళ్లిళ్లు అయితే చేసుకుంటున్నారు కాని కనీసం ముద్దు మురిపాలకు కూడా సమయం ఇవ్వడం లేదట . సోషల్ మీడియాకు మాత్రం  విపరీతంగా బానిసలై పోతున్నారు.

దీనితో జీవిత భాగస్వాములను సైతం పట్టించుకోవడం లేదని …సర్వేలో తేలింది.ప్రస్తుత కాలంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉన్నంత సేపు పనిలోమునిగి ఉంటారు. ఇంటికి వచ్చాక ప్రేమగా ముద్దు కూడా పెట్టుకోకపోవడం విశేషం. దానికి కూడా సమయం కేటాయించుకోలేకపోతున్నారట. భార్యభర్తలు బెడ్‌రూం లోకి వెళ్లాక కూడా ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా లోకంలో కి వెళ్ళిపోతున్నారట.

అది స్త్రీ, లేదా పురుషుల మధ్య శృంగారం లేకుండా చేయడానికి కారణమవుతోందని ది నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ ఆటిట్యూడ్స్ అండ్ లైఫ్‌స్టైల్స్ నివేదిక స్పష్టం చేసింది.44 ఏళ్లలోపు జంటలు  వారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే శృంగారం లో పాల్గొంటున్నారట. 35-44 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు 2001లో నెలకు కనీసం నాలుగు సార్లు శృంగారం లో పాల్గొంటే, 2012లోఒక్కసారి మాత్రమే పాల్గొన్నారట. పురుషుల్లోనూ అదే పరిస్థితికనిపిస్తుందట.

గతంలో నెలకు నాలుగు నుండి ఐదు సార్లుశృంగారం లో పాల్గొనగా, ఇప్పుడు మాత్రం మూడు సార్ల కంటే ఎక్కువ సార్లు శృంగారం చేయడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. శృంగారం చేయాలనే కోరిక ఉన్నవారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉందిట. జంటలు కాకుండా వ్యక్తిగతంగా పరిశీలిస్తే..శృంగారం ఎక్కువగా కావాలని కోరుకునే వారి సంఖ్య బాగాపెరుగుతోందని నిపుణులు తెలియచేసారు.

మనస్సులో కోరికల్ని తమ బాగా స్వాములతో తీర్చుకునే తీరిక లేకుండా సోషల్ మీడియా ఎంతగా జీవితాల్లోవిషం చిమ్ముతుందో ఈ సర్వేలలో తేలింది.ఎ వ్వరికి వారు దీని నుండి బయట పడవలిసిందే తప్ప వేరే దారి లేదని గమనించండి.  భార్యాభర్తల సంబంధాన్ని మరింత బలంగా చేయడంలో సెక్స్ పాత్ర అత్యంత ప్రధానమైంది అని గుర్తించండి.

అందుకే దంపతులు ఒకరితో ఒకరు  చర్చించుకుని  తమ శృంగార జీవితానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాంపత్య జీవితాన్ని నిత్య వసంతంగా మార్చుకోవాలి. కాబట్టి పడకగదిలోకి బయటి టెన్షన్స్ అన్నీ మోసుకురాకూడదు.వీలుంటే ఫోన్స్ కూడా బయట పెటేయండి లేదా సైలెంట్ లో పెట్టండి .  బెడ్రూమ్‌లో ప్రశాంత వాతావరణంలో.. ఉల్లాసమైన మూడ్‌లో శృంగారంలో పాల్గొనాలి. అలా ఇద్దరికీ లైంగిక తృప్తి కలిగినప్పుడే.. ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ భావం ఏర్పడుతుంది.దానిని ఎప్పుడు కోల్పోకండి .