Pregnancy: ప్రెగ్నెంట్ కాగానే ప్రతి స్త్రీ తన గురించి కంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది.. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినది ఏమిటంటే మీరు బాగుంటేనే మీ బిడ్డ కూడా బాగుంటుంది. కాబట్టి కన్సీవ్ అని తెలియగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే.. ఏది సరైన హాస్పిటల్ అనేది తెలుసుకోలేకపోవడం. ముందు ఈ విషయాన్ని చాలామంది చాలా తేలికగా తీసుకుంటారు. కానీ నెలలు పూర్తిగా నిండిన తర్వాత ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి మరావలిసి రావొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, కన్సీవ్ అయినా నాటి నుంచిడెలివరీ జరిగే వరకూ ఒకే హాస్పిటల్లో చూపించుకోవడం అనేది చాలా మంచి పద్దతి . ఇలా చేయడం వలన మీకు డాక్టర్‌కి మధ్య ఓ సయోధ్య కుదరడం తో పాటు డెలివరీ టైం లో మీ చుట్టూ అందరూ తెలిసినవారే కనిపిస్తారు.
దీనివలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ధ్యేర్యం గా ఉంటుంది . అందుకే ప్రెగ్నెంట్ అని తెలియగానే మీ బడ్జెట్‌కి తగినట్లు సిటీలోనే మంచి డాక్టర్‌తో పాటు, మంచి హాస్పిటల్ని ఎంచుకోవడం సెలెక్ట్ చేసుకోవడం మంచిది.
చాలామంది అమ్మాయిలు స్పీడ్ గా నడవడం, పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం, మెట్లెక్కడం, సైక్లింగ్ చేయడం.. లాంటి అలవాట్లు ఉంటాయి. అయితే ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇలాంటి వేగవంతమైన పనులు చేయకుండా ఉండటం మంచిది.దాని వల్ల కళ్లు తిరిగి పడిపోవచ్చు.. . ప్రెగ్నెన్సీ తొలి రోజుల్లో హెచ్‌సీజీ హార్మోన్ వల్ల కళ్లు తిరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి పనులకు దూరం గా ఉండాలి. ప్రెగ్నెంట్ కాగానే స్త్రీలకు తెలిసిన వారందరి అనుభవాలని సలహాలు గా ఇచ్చేస్తుంటారు. కానీ శాస్త్రీయంగా ఆ పద్ధతులు మీ ఆరోగ్యానికి సరిపోతాయా లేదా అని తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాత వాటిని పాటించడం మంచిది. దీనికోసం డాక్టర్ సలహాలతో పాటు.. మీరు కూడా ఇంటర్నెట్లో వెతికి మరింత సమాచారాన్ని తెలుసుకోండి.ప్రెగ్నెంట్ అని తెలియగానే డాక్టర్ స్కానింగ్ వివిధ రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, వంటివి చేయించుకోమని సూచిస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా … అని అనుకోకుండా అవన్నీ మీ ఆరోగ్యం కోసమే అని గుర్తు పెట్టుకోండి. మీరు మంచి ఆరోగ్యంతో ఉంటేనే మీ బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి డెలివరీ వరకు మీ డాక్టర్ సలహాతో పరీక్షలు చేయించుకోవాలని అశ్రద్ధ చేయొద్దు.
ప్రతి మనిషికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర చాలా అవసరం. అయితే ఎక్కువ శ్రమ పడేవారు ఇంకాస్త ఎక్కువ నిద్ర పోవడం వలన విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కంటి నిండా నిద్రపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి దూరంగా ఉండి చక్కని విశ్రాంతి పొందుతారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ బిడ్డ తో పాటు మీరు ఆరోగ్యంగా సురక్షితం గా ఉంటారు.