NewsOrbit
న్యూస్

Marriage:  ఓహ్ అందుకా పెళ్ళిలో జీలకర్రా బెల్లం నెత్తిన పెడతారు — ఇంత కథ ఉందా , సూపర్ !!

Marriage:  పెళ్లి లో  జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వెనుక చాలా విషయమే ఉంటుంది. జీలకర్ర తో  బెల్లం కలిపి మెత్తగా చేసిన  ముద్దలో  మంచి  పాజిటివ్ విద్యుత్ తరంగాలు ఉంటాయి. మన తల మీద ఆ ముద్ద పెడితే నిద్రాణ వస్థలో ఉన్న ఆ కేంద్రం విచ్చుకొని సహస్రార చక్ర గుండా అగ్న చక్రగుండా    రెండు కళ్ల మధ్య ఉన్న స్థలం  ద్వారా ఉత్తేజితం  చేయబడుతుంది.ఆ  సుముహూర్తం లో   వధూవరులు  ఒకరి కళ్ళలో ఒకరు  చూసుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచన  కలిగి సంసార జీవితం లో ఒకే మాట మీద  మంచి  ఒకే బాటలో  పయనిస్తారు అని  నమ్మకం.

జీలకర్ర బెల్లం కేవలం పెళ్ళిలో తల మీద పెట్టుకోవడానికి మాత్రమే కాదు.. నిత్య జీవితం లో ఈ  రెండిటిని వాడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జీలకర్ర ను వాడి పొట్ట    సంబంధిత    వ్యాధులన్నిటినీ   నివారించుకోవచ్చు .  ప్రధానంగా ఆడవారి  గర్భాశయాన్ని  శుభ్రపరచడం తో పాటు   సమస్త దోషాలను పోగొట్టి , గర్భసంచి  బలం గా ఉండేలా చేసే  శక్తి జీలకర్ర కు ఉంది.      వీర్యపుష్టి లేనివారు , జీలకర్ర, బెల్లం, కలిపి నూరుకొని  చిన్న చిన్న ఉండలుగా చేసుకుని   రోజుకు రెండు పూటలా తింటే చక్కని వీర్య పుష్టి వస్తుంది. రెండు చెంచాల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి  కషాయంగా కాచి వడగట్టుకుని తాగితే గుండెనొప్పులు, బి.పిని, షుగర్‌ను  అదుపు చేస్తుంది.

అజీర్ణ సమస్య ఉన్నవారు , వికారంగా ఉన్నప్పుడు, అరగక పుల్లటి త్రేన్పులు తో  బాధపడేవారు కొంచెం జీలకర్రను నములుతూ నెమ్మదిగా రసం  మింగుతూ ఉంటే మంచి ఉపశమనం పొందవచ్చు. కడుపులో ఉండే  నులి పురుగుల  నివారణకు  జీలకర్ర ఎక్కువ  తీసుకుంటూ ఉంటే సమస్య నివారణ అవుతుంది. మొలల సమస్య ఉన్నవారు వారు, పసుపు కొమ్ములు,జీలకర్ర, సమానంగా  తీసుకుని ఆ రెండు కలిపి  మెత్తగా దంచి, కుంకుడు గింజ సైజులో మాత్రలు చేసుకుని రోజుకు  మూడు పూటలా రెండు మాత్రలు చొప్పున తీసుకుంటే మొలలు బాధ తగ్గుతుంది. ఈ విధంగా మన వంటింట్లో వాడే  జీలకర్ర తో  కొన్ని రోగాలను నయం చేసుకోవచ్చు.

స్త్రీలు గర్భధారణ స‌మ‌యంలో రక్తహీనత సమస్యను  ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. బెల్లంలో ఐర‌న్ సంవృదిగా ఉన్న కార‌ణంగా  తగిన మోతాదులో  తీసుకుంటే రక్తహీనత    తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బెల్లం, జీలకర్ర క‌లిపి తినడం వ‌ల‌న‌ రక్త ప్రసరణ  కూడా బాగా జరుగుతుంది ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వ‌ల‌న రోగనిరోధక శక్తి  పెరుగుతుంది.  ఈ రెండు  పదార్దాలలో  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.  ఇది  రోగనిరోధక కణాలు   బలోపేతం చేస్తాయి.   ఈ రెండిటిని కలిపి తినడఁ  వ‌ల‌న అనేక రకాల అంటువ్యాధుల నుంచి  కూడా  రక్షణ కలుగుతుంది. బెల్లం   జీలకర్రల‌ను కలిపి   తీసుకుంటే గుండె జబ్బుల   నుంచి బయట పడతాము.  బెల్లం , జీలకర్ర రెండు కార్డియో ప్రొటెక్టివ్ చర్య తో ఉండటం వలన  ఇది గుండెకు సంబంధించిన రక రకాల వ్యాధులు వచ్చే  ప్రమాదాన్ని  బాగా తగ్గించేస్తుంది.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju