పడక గదిలోస్వర్గం చూడడానికి రోల్ ప్లే కి మించిందే లేదని చెప్పవచ్చు. అది ఎలా చేయాలనే విషయంమీకు తెలిసిఉండకపోవచ్చు , కానీ చేయాలి అనుకుంటే మాత్రం చాల తేలిక. ఇలా చేస్తే మాత్రం మీరు మీ భాగస్వామితో పరిపూర్ణం గా శృంగారాన్నిఆనందించవచ్చు ….
మీకు తెలిసిన ప్రేమ తో కూడిన శృంగార భరిత సన్నివేశాలని , పాప్ కల్చర్ లో చూసిన వాటితోనో మొదలు పెట్టండి. ఎక్కువ ఆలోచిన్చకుండా మీకు తెలిసినదానితో ప్రారంభిస్తే చాలా సుఖంగా ముందుకు వెళ్ళ గలుగుతారు…రోల్ ప్లే ఇంట్లో చేయడం వలన సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీరిద్దరే ఉంటారు కాబట్టి అది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి ఉండదు. మాములుగా మీరు ఇంట్లో ధరించే బట్టలే వేసుకోవచ్చు.. చొక్కా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిపాటి వస్త్రధారణ మాత్రం రోల్ ప్లేకు బాగా ఉపయోగపడుతుంది…..
మీరు చెప్పదలుచుకున్న విషయం గుర్తు రాకపోయినా మీ భాగస్వామితో సంభాషణ కొన సాగిస్తే అందులోంచే సంభాషణ ఇంకా పెరుగుతుంది. మీరు చెప్పదలుచుకున్న విషయంపై అయోమయానికి గురైనప్పుడు మృదువుగా నవ్వుతూ ఉండండి . రోల్ ప్లే మీ ఇద్దరి కోసమేననిమర్చిపోకండి .. ప్రేక్షకులు ఎవ్వరు ఉండరు మీరేమీ బాగా నటించక్కర్లేదు. మాములుగా మాట్లాడుకున్న సరిపోతుంది. రోల్ ప్లే సజావుగా సాగడానికి ఏది అవసరమో అంత వరకే మాట్లాడుకోండి. అప్పుడు మీ మైండ్ విశ్రాంతి పొందడం ద్వారా మూడ్ లోకి వెళ్లిపోవచ్చు. ప్రతికూల విషయాలను అంటే నెగెటివ్ అంశాలను పక్కన పెట్టి రొమాంటిక్ అంశాల మీదనే దృష్టిఉంచండి. మాటల ద్వారా ఒకరినొకరు ఉత్తేజ పరుచుకోండి …కానీ గొడవలు పడేందుకు అవకాశం లేకుండా చూసుకోవాలి.. లేదంటే మొత్తం వ్యవహారం పాడవుతుంది .