NewsOrbit
జాతీయం

Odisha: ఒడిశాలో రెండు గంటల్లో 61 వేల పిడుగులు..పిడుగులు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు!!

Odisha: ఒడిశా రాష్ట్రంలో శనివారం ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో వర్షంతో పాటు భారీగా పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది మరణించినట్లు 14 మంది గాయపడినట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో 8 పశువులు కూడా మరణించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకటన చేయడం జరిగింది. రెండు గంటల వ్యవధిలో ఏకంగా 61 వేల పిడుగులు పడినట్లు స్పష్టం చేయడం జరిగింది. దీంతో మృతుల కుటుంబాలకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషీయా ప్రకటించడం జరిగింది. ఇంకా పశువుల మరణాల విషయంలో కూడా సహాయం చేస్తామని స్పష్టం చేయడం జరిగింది.

61 thousand thunderbolts in Odisha Precautions to be taken to avoid thunderbolts

ఎక్కువగా ఖుర్ధా జిల్లాలో.. మరణాలు నమోదు అయ్యాయని ఒడిశా ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ ప్రాంతంలో అత్యధికంగా నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఒడిశాలో జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడటంతో పిడుగులు పడ్డాయి. అంతకుముందే భారత వాతావరణ శాఖ శనివారం ఒడిశాలో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా.. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించడం జరిగింది.

61 thousand thunderbolts in Odisha Precautions to be taken to avoid thunderbolts

ఈ క్రమంలో ఉదృతంగా శనివారం వర్షం పడటంతో పాటు భారీగా పిడుగులు పడటంతో.. ఊహించని విధంగా ప్రాణ నష్టంతో పాటు.. పశువులు మరణించడం జరిగింది. ఇది ఎలా ఉంటే ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం సక్రియంగా ఉందని మరో రెండు రోజుల్లో ఒడిశాలో వర్షాలు పడే అవకాశం ఉందని మరోసారి భారత వాతావరణ శాఖ ప్రకటన చేయడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీకు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

పిడుగులు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు:

1. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లి తలదాచుకోవాలి.
2. మైదాన ప్రాంతాల్లో చెవులు మూసుకొని వంగి, మోకాళ్లపై కూర్చోవాలి.
3. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై సమాంతరంగా పడుకోకూడద్దు.
4. ఓ బృందంగా వెళుతున్నప్పుడు. విడి విడిగా విడిపోయి నడవాలి.
5. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
6. పర్వతాలలాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదు.
7. ఎత్తై చెట్ల కింద తలదాచుకోకూడద్దు.
8. చార్జింగ్ అవుతున్న ఫోన్‌ను వినియోగించవద్దు.
9.ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.
10.ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.
11.ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. 12.కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.
13.పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి, భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
14.ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.
15.అంతేకాదు పిడుగులు పడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.
16.ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.
17.ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju