29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మరో సారి సీబీఐ సోదాలు .. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా ఏమన్నారంటే..?

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు మరో మారు డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై దాడులు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సీబీఐ బృందం ఈ సోదాలు చేపట్టింది. ఢిల్లీ సచివాలయంలోని తన ఛాంబర్ లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడంపై మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Manish Sisodia

 

“సీబీఐ అధికారులు ఇవేళ మరో మారు నా కార్యాలయానికి వచ్చారు. వాళ్లకు స్వాగతం పలుకుతున్నా, వాళ్లు నా ఇంట్లో, ఆఫీసులో, బ్యాంకు లాకర్ లో ఇది వరకే తనిఖీలు చేశారు. నా సొంత ఊరికి వెళ్లి కూడా విచారణ జరిపారు. కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు. భవిష్యత్తులోనూ ఏమీ దొరకదు. ఎందుకంటే .. నేను ఎలాంటి తప్పు చేయలేదు” అని సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.

గత ఏడాది ఆగస్టు నెలలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ జరిగినట్లుగా కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన నివేదిక ను పరిగణలోకి తీసుకుని సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా పలు మార్లు తనిఖీలు నిర్వహించారు. పలువురు నిందితులను ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా మరో సారి సీబీఐ అధికారులు సోదాలు జరపడం కలకలాన్ని రేపింది. ఈ కేసు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీలో అదికారంలో ఉన్న ఆమ్ అద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ .. విచారణ చేపట్టిన పోలీసులు


Share

Related posts

Siri: సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సూపర్ గురూ.. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అందరికీ ఉండాలి!

Ram

Tree: ఈ చెట్లను మీ చేత్తో నాటారంటే ఇంకా తిరుగు అనేది ఉండదు!!

siddhu

స్త్రీ , పురుషులకు ఆ విషయం లో ఉపయోగ పడే ఆకుకూర ఇదే !!

Kumar