NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ టీం ప్రయ‌త్నం… క‌రోనాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

VijayasaiReddy: Targeted in Politics RRR Case

గ‌త కొద్దికాలంగా అంద‌రి చూపు క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు అంతం అవుతుందా? అనే దానిపైనే ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా ఈ మ‌హమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా? అంటూ అంతా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అందులోనూ వైఎస్సార్సీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి వ‌ల్ల కావ‌డం గ‌మ‌నార్హం. క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు.

విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌తో

కోవిడ్‌ వ్యాక్సిన్ దేశంలో ఎప్ప‌‌టికి‌ అందుబాటులోకి వస్తుందని పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా రాజ్యసభలో ఆదివారం వైఎస్ఆర్‌సీపీ స‌భ్యుడు వి.విజయసాయి రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ ప్రశ్నకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే మంత్రి స‌మాధానం ఇస్తూ వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని వెల్ల‌డించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే చెప్పారు. అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్‌, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నట్లు తెలిపారు.

కేంద్రం ఏం చేస్తోంది?

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరో 30 వరకు వ్యాక్సిన్‌ పరిశోధనలకు సాయపడుతున్నట్లు కేంద్ర‌ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే చెప్పారు. కోవిడ్‌ 19 టెస్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని కేంద్ర‌ మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్‌ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్‌ -19 టెస్ట్‌లు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే తెలిపారు. అలాగే కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌, హెల్త్‌ సిస్టమ్‌ ప్యాకేజి కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే ప‌లు ప్రైవేటు సంస్థ‌లు కోవిడ్ వ్యాక్సిన్‌ను అం‌దుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న‌ కృషి తుది ద‌శ‌కు చేరిన సంగ‌తి తెలిసిందే.

author avatar
sridhar

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N