NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జనసేనకు బిగ్ షాక్ .. వైసీపీలో చేరిన హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్

YSRCP: జనసేన పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. ఆయన జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి ఇవేళ వైసీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన సూర్యప్రకాష్ .. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేనాని తీరుపై విమర్శలు గుప్పించారు.

పార్టీ నేతలతో కూడా మాట్లాడే సమయం పవన్ కు లేదా అని ప్రశ్నించారు. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా అని పవన్ ను నిలదీశారు. ఆరేళ్లలో తాను అరగంట మాత్రమే పవన్ తో మాట్లాడానని అన్నారు. పార్టీ బలోపేతం చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఏ మాత్రం చేయకపోగా, చంద్రబాబును సీఎం చేయాలనే ఆరాటపడ్డారని అన్నారు. సామాజిక న్యాయం గురించి పవన్ కు ఏమాత్రం తెలియదని, జనసేనలో మాట్లాడే స్వేచ్చ ఉండదని అన్నారు.

సలహాలు ఇచ్చే వారిని వైసీపీ కోవర్టులంటూ పవన్ బహిరంగంగా అన్నారని అన్నారు. పవన్ ఏమి ఆశించి పార్టీ పెట్టారో ఆయనకే క్లారిటీ లేదని అన్నారు. మనసు చంపుకుని పార్టీలో ఉండలేక ఇవేళ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. బేషరతుగా వైసీపీలో చేరినట్లు చెప్పారు. క్రమశిక్షణ గల నేతగా వైసీపీ కోసం పని చేస్తానని తెలిపారు.

గత కొంత కాలంగా చేగొండి సూర్యప్రకాష్ తండ్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ పొత్తులో భాగంగా 40 నుండి 60 అసెంబ్లీ స్థానాలు తీసుకోవడంతో పాటు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని, జనసేన అభిమానుల కోరిక మేరకు ఆలా చేస్తేనే జనసేన, టీడీపీ మధ్య ఓటు ట్రాన్సఫర్ సక్రమంగా జరుగుతుందని హరిరామ జోగయ్య సూచించారు.

అయితే పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లు మాత్రమే తీసుకోవడంపై హరిరామ జోగయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సలహాలు ఇచ్చే వాళ్లు కాదని, పార్టీ కోసం పోరాడే వాళ్లు కావాలని అనడం కూడా వీరి ఆగ్రహానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చేగొండి సూర్యప్రకాష్ జనసేనను వీడి వైసీపీలో చేరారు.

చేగొండి సూర్యప్రకాశ్ జనసేనలో 2018లో చేరారు. ఆయనను పవన్ కళ్యాణ్ 2022లో పీఏసీ మెంబర్ గా నియమించారు. సూర్యప్రకాశ్ జనసేన నేతగా ఆచంట నియోజకవర్గంలో పని చేస్తూ ఉండేవారు. అయితే తన సీటుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకపోవడంతో సూర్యప్రకాశ్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీలో చేరితే ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం లభిస్తుందన్న అంచనాతో జాయిన్ అయినట్లు తెలుస్తొంది.

YS Sunitha: వైఎస్ సునీత సంచలన కామెంట్స్ కు వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇలా

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju