NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రి..! జగన్ ఆదేశాలే ముఖ్యం..!!

cm jagan observing minister jayaram activities

మంత్రిగారి కుమారుడికి బెంజ్ కారు లంచం..! ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీలను ఇరికించాలని చూసిన వైసీపీకి.. అదే మాజీలు చెమటలు పట్టిస్తున్నారు. జగన్ క్యాబినెట్ లోని మంత్రి కుమారుడే ఈఎస్ఐ స్కామ్ లో ఏ14 నిందితుడి నుంచి బెంజి కారు బహుమతిగా తీసుకున్నాడని ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలంటూ ఎదురు దాడి చేస్తున్నారు. ఈ పరిణామం జగన్ క్యాబినెట్ పై పెద్ద అవినీతి మరకగా మారింది. గడచిన ఆరు, ఏడు నెలల నుంచి అదే కారులో తిరుగుతున్నట్టు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సరైన సమాధానం ఇచ్చుకోలేక మంత్రి జయరామ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

cm jagan observing minister jayaram activities
cm jagan observing minister jayaram activities

ఆధారాలు చూపించి అయ్యన్న సవాల్..

ఆ కారుతో తనకు సంబంధం లేదంటున్న మంత్రి జయరామ్ వాదనలను కొట్టి పారేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. మంత్రికి సంబంధం లేకపోతే ఆయన ఇంటి వద్దే ఎందుకు కారు ఉందో చెప్పాలని.. ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అతికించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్ 09 టీసీ 0262 రిజిస్ట్రేషన్ నెంబరుతో గత డిసెంబర్ 12న కారు కొనుగోలు చేశారని కూడా చెప్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కార్తీక్ ఈ కారు మంత్రి కుమారుడికి ఇచ్చాడని కుండబద్దలు కొడుతున్నారు అయ్యన్నపాత్రుడు. మంత్రి జయరామ్ కు కార్తీక్ బినామీ అని కూడా అంటున్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.. ఇవిగో ఆధారాలు.. రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

జగన్ ఆదేశాలే తరువాయి..?

సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి అవినీతి వ్యతిరేకంగా ఉంటున్నారు జగన్. తనపై, తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక లేకుండా చూసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఫిర్యాదులొచ్చినా అధికారులకు స్పష్టమైన సంకేతాలిస్తూ పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తన క్యాబినెట్ లోని మంత్రిపైనే.. లక్షల విలువైన బెంజి కారు తీసుకున్నారనే ఆరోపణలు.. ఆధారాలు కూడా వస్తూండటంతో జగన్ దీనిపై సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. విచారణ జరిపి తప్పు నిర్ధారణ జరిగితే జయరామ్ ను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ నిరాధార అరోపణలుగా తేలితే అయ్యిన్నపాత్రుడుపై కేసు నమోదు చేసే అంశాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

 

author avatar
Muraliak

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju