NewsOrbit
న్యూస్

గోవా ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం!గంజాయి సాగుకు ఆమోదముద్ర !!

గోవా ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది గంజాయి సాగుచేసేందుకు గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు తమ డిపార్ట్మెంట్ అనుమతిచ్చినట్లు గోవా న్యాయశాఖ మంత్రి నిలేష్ కాబ్రాల్ తెలిపారు. న్యాయబద్ధమైన అంశాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.

1985లో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్(NDPS)కింద గంజాయి మొక్క నిషేధిత జాబితాలో చేరిందని కాబ్రాల్ తెలిపారు. గంజాయి మొక్కలు నాటేందుకు ఇప్పుడు అనుమతిచ్చామని..దీంతో ఫార్మాకంపెనీలకు ఈ సాధారణ డ్రగ్ అమ్మబడుతుందని తెలిపారు.

కాగా,గంజాయి సాగు విషయంలో గోవా ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. బుధవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన గోవా కాంగ్రెస్ ప్రతినిధి అమర్నాథ్ పంజికర్…బీజేపీ ప్రభుత్వం సాధ్యమైనంత తక్కువస్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్దమని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంపై గోవా ఫైట్ చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..రాష్ట్ర సామాజిక వ్యవస్థలోకి డ్రగ్ మరింతగా వచ్చేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పంజికర్ డిమాండ్ చేశారు.

గంజాయిని చట్టబద్దం చేయడం..బహిరంగ దుర్వినియోగానికి దారితీస్తుందని,ప్రశాంతమైన గోవా వాతావరణాన్ని నాశనం చేస్తుందని మాజీ మంత్రి,స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ కౌంటీ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కౌంటీ డిమాండ్ చేశారు.పర్యాటక ప్రాంతమైన గోవాలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంటుంది.ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా నిషేదించిన గంజాయి సాగును కూడా రాష్ట్రంలో అనుమతించడంతో రానున్న రోజుల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారగలదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ఔషధతయారీకే గంజాయి సాగు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అది పక్కదారిపట్టే ప్రమాదం పొంచి ఉంది .

 

author avatar
Yandamuri

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N