Darsi Results: వైసీపీకి దడ పుట్టించేలా వున్న దర్శి ఫలితం!ఇంకా అధికార పార్టీ నేతలు కళ్లు తెరవకుంటే ఇదే పునరావృతం

Share

Darsi Results: ప్రకాశం జిల్లాలో వైసిపికి తొలిసారిగా అతి పెద్ద షాక్ తగిలింది.దర్శి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది.మొత్తం ఇరవై వార్డులు ఉండగా పదమూడు వార్డులను టీడీపీ గెలుచుకోగా వైసిపి ఏడువార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Darsi Results makes YCP Tremble
Darsi Results makes YCP Tremble

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.కేవలం రెండున్నర ఏళ్లలోనే పరిస్థితి పూర్తిగా తారుమారైంది.నిజానికి దర్శిలో టీడీపీకి నియోజకవర్గ ఇన్చార్జి కూడా కరువు కాగా చీమకుర్తి నుండి ఒక నేతను తీసుకొచ్చి అక్కడ పెట్టారు.అలాంటి చోట వైసిపి ఘోరపరాజయం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు.ఇక ఈ ఎన్నికల్లో వైసిపి చాలా హడావిడి చేసింది పలువురు మంత్రులను సైతం తీసుకొచ్చి ప్రచారం చేయించింది.అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

కొద్దిగా వెనక్కు వెళితే!

వైసిపి ఆవిర్భావం తర్వాత రెండుసార్లు దర్శిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014 లో టిడిపి అభ్యర్థి శిద్దా రాఘవరావు స్వల్ప ఆధిక్యతతో వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ని ఓడించారు.2019 లో వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ దాదాపు నలభై వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావును మట్టికరిపించారు.అయితే అప్పట్లో శివప్రసాదరెడ్డి, వేణుగోపాల్ కలిసి పనిచేశారు.కాని కాలక్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తి అవి వారి మధ్య బాగా దూరం పెంచాయి.ఇప్పుడైతే వారు ఉప్పు నిప్పులాగ ఉన్నారు.దర్శి ఎన్నికల్లో వైసిపి ఓటమికి ఇదో ప్రధాన కారణం.

Darsi Results: కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు

అంతేకాదు కులాల పునరేకీకరణ కూడా ఈసారి జరగలేదు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో బాగా ప్రాబల్యం కలిగిన రెడ్లు కాపులు కలిసి గంపగుత్తగా వైసిపికే ఓట్లు వేయటంతో వేణుగోపాల్ అద్భుత మెజార్టీతో గెలుపొందారు.అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల కారణంగా దర్శిలో రెడ్లు కాపులు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.అది కూడా మున్సిపల్ ఫలితాన్ని తారుమారు చేసిందంటున్నారు.

ఎమ్మెల్యేపై టన్నులకొద్దీ ఆరోపణలు, ఫిర్యాదులు!

ఎమ్మెల్యే అయ్యాక మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందంటారు.నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోకుండా తిరుగుతుండటంతో ఆయన సోదరుడు శ్రీధర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో కొందరు అధికారులతో వారికి పెద్ద పెద్ద వివాదాలు సైతం ఏర్పడ్డాయి.అవినీతి ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి.ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్ బదిలీ విషయంలో శ్రీధర్ ఆయనతో సాగించిన ఆడియో టేపు వైరల్ అయింది.ఇవన్నీ వైసిపికి ప్రతికూలంగా మారాయని చెప్పాలి. ఎమ్మెల్యే వేణుగోపాల్ పట్ల ప్రజావ్యతిరేక అధికంగా ప్రబలింది.

Darsi Results: సయోధ్య కుదర్చలేక పోయిన జిల్లా నాయకత్వం!

దర్శకులు ముఠాల కుమ్ములాటలు వైసిపిని ముంచేస్తున్నాయని స్పష్టంగా తెలిసిపోతున్నా జిల్లా పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. డ్యామేజ్ నివారణ చర్యలు చేపట్టలేదు.ఈ విషయంలో జిల్లా మంత్రి బాలినేని వాసు వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి.నిజానికి ముఖ్యమంత్రికి సమీప బంధువైన మంత్రి వాసు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల కంటే వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యమే ఇచ్చి కొందర్ని మాత్రమే ప్రోత్సహిస్తుండడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నది నిర్వివాదాంశం.ఏదేమైనా దర్శి మున్సిపల్ ఎన్నిక ఫలితం వైసిపికి కనువిప్పు కావాలి.హేమా హేమీలు దిగొచ్చి ప్రచారం జేసినా టిడిపి కి దర్శి ఓటర్లు పట్టం కట్టారు అంటే వైసిపికి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే!

 


Share

Related posts

జెసిండా సంచలన నిర్ణయం ఏంటో తెలుసా ……!!

Special Bureau

Varudu Kaavalenu Review : వరుడు కావలెను మూవీ రివ్యూ

Ram

Modi: మోడీకి అస‌లు ప‌రీక్ష నేటి నుంచే… ఎవ‌రిది పై చేయి కానుంది?

sridhar