Fire Accident In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే నేడు ఉదయ్ నగర్ లోని ఓ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఆస్తినష్టం భారీగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పది రోజుల క్రితం లజపత్ నగర్ మార్కెట్ లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.