Instagram: ప్రస్తుతం ప్రపంచంలో పలు సోషల్ మీడియాలు రాజ్యమేలుతున్నవేళ ఇన్స్టాగ్రామ్ అగ్రగామిగా వెలుగొందుతోంది. అత్యధికమైన యూజర్లు దీనికే ఉండటం గమనార్హం. ఇకపోతే 2022వ సంవత్సరంలో దీనిలో భారీ మార్పులు, చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది. మెటా (Facebook) ఆధీనంలో ఉన్న ఇన్స్టా రూపురేఖలు మరింత రూపుదిద్దుకొనేలా కనబడుతోంది. నూతన సంవత్సర సందర్భంగా రూపొందించిన ప్రణాళికను ఇన్స్టాగ్రామ్ హెడ్ అయినటువంటి ఆడమ్ మొసెరీ తాజాగా వెల్లడించారు.
Gunugu Flower: అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా గునుగు పువ్వు..!!
ఇన్స్టాగ్రామ్లో ఏఏ మార్పుపు ఉండబోతున్నాయి?
ఇన్స్టాగ్రామ్లో వీడియోల సంఖ్యను గణనీయంగా పెరగనుంది. అలాగే వీడియో డ్యూరేషన్ పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీడియోలపైనే సదరు కంపెనీ దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇన్స్టా హెడ్ ఆడమ్ స్పష్టంగా చెప్పారు. కాగా ఎక్కువ నిడివి ఉండే వీడియోలను అప్లోడ్ చేసేందుకు IGTV Appను తాజాగా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన విషయం తెలిసినదే. దాంతో యూజర్ 60 నిమిషాల వరకు నిడివి ఉన్న వీడియోలను ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు.
Somu Veerraju: సోముపై చిర్రుబుర్రు..! ఏపీ బీజేపీలో కస్సుబుస్సు..!
ఇన్స్టాగ్రామ్లో ఏఏ చేర్పులు ఉండబోతున్నాయి?
అలాగే క్రియేటర్ల కోసం ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేసేలా Video Monetization ఫీచర్ కూడా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. తద్వారా వీడియోల ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించేందుకు అవకాశం వుంది. ప్రస్తుతం వీడియో యాప్స్ బాగా అభివృద్ధి చెందుతుండడంతో ఇన్స్టా కూడా అటు వైపే మొగ్గు చూపేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే షార్ట్ వీడియోల విభాగంలో ఇన్స్టా రీల్స్ దూసుకెళుతుండగా.. ఇక ఎక్కువ నిడివి ఉన్న వీడియోల సంఖ్యను సైతం పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.