రామ్ గోపాల్ వర్మకు హై కోర్టు భారీ షాక్…! ఆడపిల్ల విషయం అంటే ఆషామాషీ కాదు వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే అన్న విషయం తెలిసిందే. రియల్ స్టోరీ లపై సినిమాలు తీస్తూ తనదైన శైలిలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తే వర్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు…

 

ఆయన సినిమాలన్నీ అంతే….

అయితే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తన సొంత సినీ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో మహిళలను అర్ధనగ్నంగా చూపించడం పైన మాత్రమే ఆయన దృష్టి పెడుతున్నట్లు ఉందని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన దిశా ఘటన, దాని ఎన్కౌంటర్ పైన కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా తీసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది.

నిందితుల కుటుంబాలకి నిద్ర కరువు

దిశ ఎన్ కౌంటర్ చిత్రం నిలిపి వేయాలని ఆ కేసులోని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని చెప్పిన కృష్ణ మూర్తి ఈ చిత్రంలో వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోర్టు వారిని కృష్ణమూర్తి కోరారు.

అందరికీ షోకాజ్ నోటీసులు

దిశ సంఘటన పై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో అసలు చిత్రాన్ని ఎలా తీస్తారు అని కృష్ణమూర్తి ప్రశ్నించడం జరిగింది. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టువారిని కోరారు. సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు ముంబై. బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ లకు షోకాజ్ నోటీసులను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది

దీంతో చాలామంది వర్మ సినిమా బయటకు రావడం కష్టమేనని…. ఆడపిల్ల పై జరిగిన అత్యాచారం అతిఘోరమైన హత్యకు సంబంధించిన సినిమాకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని హైకోర్టు తలఅంటుంతుందని వర్మ కు చుక్కెదురు కావడం ఖాయమని భావిస్తున్నారు. మరి ఇంటర్వ్యూలో లాజిక్ లు మాట్లాడే వర్మ ఇప్పుడు కోర్టు వారిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి..!