ఈ తరం తల్లిదండ్రులు చాలామంది సంపాదన కోసం తీరికలేకుండా పనిచేస్తూనే ఉన్నారు. పిల్లలను పట్టించుకొనే సమయం వారికి అస్సలు ఉండడం లేదు. ఈ కారణం గా తలిదండ్రులు మంచి చెడూ ఆలోచించకుండా ఇంట్లోనే పిల్లలకు సకల సౌకర్యాలు అందిస్తున్నారు. వారు ఇస్తున్న సౌకర్యాలలో అగ్రభాగం లో ఉండేది ఇంటర్నెట్.
అయితే.. ఈ సౌకర్యం పిల్లల్ని తప్పుదారిలోకి నడిపిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంతో వారు వెళ్లకూడని దారిలో వెళ్తున్నారు.
వయ్యస్సుకాని వయ్యస్సులో సెక్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపిన వివరాల ప్రకారం ‘kidsXXX’ పేరిట ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో శృంగారానికి సంబంధించిన వీడియోలుఫొటో లు, పంపడంజరుగుతోంది. ఇందులో మొత్తం 234 మంది సభ్యులు ఉండగా వారిలో 66మంది భారతీయులే.
శృంగారానికి సంబంధించిన మెసేజ్లకి భావి భారత పౌరులు బాగా ఆకర్షితులవుతున్నారు. వీటి వల్ల పట్టుమని 16 ఏళ్ళు రాని పిల్లలు కూడా తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చి పనులకు పాల్పడుతున్నారు.. ఆ పిచ్చికి ప్రేమ అంటూ పేరు పెట్టి ఆనాటి బాల్య వివాహాలు కళ్ళముందుకు తెస్తూ తల్లిదండ్రుల ని చిత్రవధకి గురిచేస్తున్నారు.
పిల్లలు ఇలాంటి చెడుఅలవాట్లు బారిన పడకుండా తలిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలు సుకుందాం…
పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎలా ఉంటున్నారు .. అని వారి ప్రతి పని పై పెద్దలునిఘాపెట్టాలి.
ఇంటర్నెట్లో పిల్లలు ఏమి చూస్తున్నారు.. ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ ఉండాలి.
ముఖ్యంగా స్కూల్ లో పిల్లలు ఎలా ఉంటున్నారో వారి టీచర్ల ని అడిగి తెలుసు కుంటూ ఉండాలి .
పిల్లల తో తల్లిదండ్రులు ఎప్పుడూ స్నేహం గా మెలుగుతూ వారికి దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వలన ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లల్ని వారి భవిషత్తుని రక్షించుకున్నవారిమవుతాం. చివరిగా ఒక్కమాట.. మనం జీవితం లో ఎంత తీరిక లేకుండా పనిచేస్తే అంత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందేమో కానీ పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని, ప్రేమ ని సంరక్షణని మాత్రం ఎంత డబ్బు ఇచ్చిన తిరిగి తీసుకురాలేము అని ప్రతి తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి .