NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆడిన, ఆడించిన ఇక కఠిన శిక్షే : గేమింగ్ యాక్టు కు జగన్ సర్కారు కొత్త రూపం

1968 లో భారతదేశం పేకాటను స్కిల్ గేమ్ గా గుర్తించింది. దీనిపై పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది. పేకాట ఆడటం వాళ్ళ మానసిక నైపుణ్యం పెరుగుతుంది అని గుర్తించింది. దీని తర్వాత పేకాట ను చాలా రాష్ట్రాలు నిషేధించాయి. మాకు ఈ కార్డుల గోల వద్దని ప్రత్యేక చట్టాలు చేసాయి. ఇలా పుట్టుకొచ్చిందే ఏపి గేమింగ్ యాక్ట్ 1974 . ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ చట్టంలో కొన్ని మార్పులు , చేర్పులు చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది.

1930 లో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ కాలంలోని గేమింగ్ యాక్ట్, 1350 రాజులకాలం నాటి తెలంగాణ జూద నేరం చట్టాలను 1974 లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దీన్ని తీసుకువచ్చారు. 17 పూర్తిస్థాయి లో రూపొందిన అంశాలతో దీన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జూదం, గ్యాంబ్లింగ్, డబ్బుతో ఆడే ఆటలతో పాటు అప్పట్లో ఎక్కువగా గుర్రపు పందేల జోరు ఉండేది. దీనికి చట్టంలో ప్రత్యేకమైన చర్యలు లేకపోవడంతో గుర్రపు పందేలు, రాయలసీమలో మట్కా నిరోధానికి దీన్ని తీసుకువచ్చారు. అలాగే కాటన్ ధరల్లో వ్యత్యాసం లేకుండా చూసేందుకు ఏది తోడ్పాటు ఇస్తుందని చట్టాల్లో ప్రత్యేక క్లాజులు ఉంచారు.
* చట్టం ప్రకారం జూదం లేదా పందేలు ఆడేందుకు ప్రత్యేకమైన రూమ్, ఏళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఆడిస్తే నేరం అవుతుంది. జూదం ఆడిన వారితో పాటు షెల్టర్ ఇచ్చిన వారు నేరస్థులు అవుతారు.
* డబ్బులు పెట్టి ఎలాంటి ఆటలు ఆడిన నేరమే. ఒకరికి ఒకరు పందెం కాసుకొని ఆడే ఆటలు దీని పరిధిలోకి వస్తాయి. దానికి ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు.
* దీనిలో మొదటిసారి పట్టు బడితే 6 నెలలలోపు జైలు శిక్ష, జరిమానా పడుతుంది. రెండుసారులు, అంతకు మించి దొరికితే 6 నెలల దాటి జైలు శిక్ష, జరిమానాలు ఉంటాయి.

ఎప్పుడు మార్పులు ఏమిటంటే?

జగన్ ఈ చట్టంలో మార్పులను కొత్తగా తీసుకువస్తున్నారు. అందులోను కొన్ని బెట్టింగ్ యాప్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిషేదించగా, ఆ కంపెనీలు ప్రభుత్వ తీరుపై కోర్టులకు వెళ్లాయి. ఎప్పుడు చట్టంలో సవరణలు చేసి ముందుకు వెళ్తే ఎలాంటి లీగల్ సమస్యలు రావు. దింతో చట్టంలో మార్పులు చేసేందుకు డ్రాఫ్ట్ రెడీ చేసారు .
* ఇప్పటివరకు గేమింగ్ యాక్ట్ ప్రకారం ఒక గదిలో లేదా రహస్య ప్రదేశంలో, కొందరు వ్యక్తులు పోగై
గుంపుగా జూద క్రీడలు ఆడితే నేరం గా పరిగణించేవారు. ఒక్కడే ఆడటం సాధ్యం కాదు కాబట్టి అప్పటి 1974 కు అనుగుణంగా దీన్ని రూపొందించారు.
* ప్రస్తుత సాంకేతిక యుగంలో ఒక్కరే ఇంట్లో నుంచి రమ్మీ, బెట్టింగ్ ఆడుతూ జొడంలో మునిగి తేలుతున్నారు. దింతో ఏది గేమింగ్ యాక్ట్లోకి రావడం లేదు. (దీనిపై సవరణ చేయనున్నారు)
* జూద గృహాలు నిర్వహించేవారు యాక్టులోకి వస్తారు అని ఉంది. అయితే ప్రస్తుతాం ఎలాంటి గృహాలు లేకున్నా ఆన్ లైన్ వేదికగా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. దింతో తాము ఎలాంటి గృహాలు నిర్వహించడం లేదని ఆన్ లైన్ నిర్వాహకులు తప్పించుకునే వీలుంది (దీన్ని సవరిస్తారు )
* దీనిలో పట్టుబడితే ఇప్పటివరకు కేవలం 6 నెలల శిక్ష మాత్రమే ఉంది. చాల కేసుల్లో పేకాట ఆడితే వారికీ 3 రోజుల శిక్ష వేయడం లేదా జరిమానాతో పంపుతున్నారు. ప్రస్తుత ఆన్ లైన్ గేమ్స్ వాళ్ళ కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎలాంటి తీవ్రత ఉన్నపుడు నిర్వాహకులు, నిందితులపై ఇతర సెక్షన్లు పెట్టేలా, శిక్ష కాలం పెంచేలా సవరణ ఉండొచ్చు.
ఎలాంటివి ఇంకా మరికొన్ని చట్టంలోని కీలక అంశాల ఆధారంగా మార్పులు ఉంటాయి. పాత చింతకాయ పచ్చడిలాంటి చట్టానికి పూర్తిస్థాయి మెరుగులు దిద్ది కొత్తగా చట్టాన్ని మరింత పవర్ ఫుల్ గా తీసుకురాబోతున్నట్లు, ప్రస్తుతం జోరుగా ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ వ్యవస్థను రాష్ట్రంలో నిరోధించేలా ఇది ఉంటుందని ఓ న్యాయవాది ‘‘న్యూస్ ఆర్బిట్” ప్రతినిధికి చెప్పుకొచ్చారు.

author avatar
Special Bureau

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju