NewsOrbit
న్యూస్

Jai Bhim Review: ‘జై భీమ్’ మూవీ రివ్యూ

Jai Bhim Review:తన కెరీర్ మొత్తం ఒక కమర్షియల్ సినిమాలు చేస్తూనే కంటెంట్ ఉన్న సినిమాలు చేసి సూర్య ‘జై భీమ్’  ( Jai Bhim ) అనే మరొక సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రలలో అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime) లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

Jai Bhim Review: కథ

గిరిజన కుటుంబానికి చెందిన రాజన్న, చిన్నతల్లి అనే ఇద్దరు దంపతులు ప్రధాన పాత్రలుగా ఉంటారు. అయితే ఆ ప్రాంతంలో ఒక బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఇంట్లో చోరీ జరుగుతుంది. ఎంత కష్టపడినా పోలీసులు దొంగను పట్టుకోలేకపోతారు. అయితే రాజన్న, చిన్నతల్లి లకు దొంగలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో రాజన్న పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుంటాడు. అక్కడి నుండి సినిమా పెద్ద మలుపు తిరుగుతుంది. తమకు న్యాయం చేయమని చిన్నతల్లి చంద్రు (సూర్య) అనే ఒక లాయర్ సహాయం కోరుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే చిత్రం కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఒక లాయర్ గా సూర్య ( Surya )కనబరిచిన నటన అద్భుతంగా ఉంది. ఎంతో డైనమిక్ పాత్ర చేసిన సూర్య తన కెరీర్ లో ఈ చిత్రం ద్వారా మరొక మెట్టు ఎక్కాడు అనే చెప్పాలి.కోర్టు రూమ్ డ్రామా, ఎమోషన్స్ అద్భుతంగా పండాయి. అలాగే ఒక గర్భవతి అయిన గిరిజన మహిళ పాత్రలో చిన్నతల్లి క్యారెక్టర్ చేసిన లిజోమల్ జోస్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజన్న పాత్ర చేసిన మణికందన్ తన హావభావాలతో చూపించిన బాధ చూపించి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.తెలుగువారికి బాగా పరిచయస్తులు అయిన ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రల్లో ఉండటం కలిసొచ్చే అంశం. మిగిలిన పాత్రలు తమిళ వాళ్ళు కాబట్టి ప్రధాన పాత్రల్లో వీరు ఉండడం… సూర్యతో వీరిద్దరి సీన్లు అద్భుతంగా పండాయి.

మైనస్ పాయింట్స్:

తమిళంలో జాతీయ అవార్డు సాధించిన విసరనయ్’ చిత్రానికి, ఈ చిత్రానికి దీనికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ చిత్రం చూసిన వారికి ఈ చిత్రం కొంచెం రొటీన్ గా అనిపించవచ్చు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు దాదాపుగా అలాగే ఉంటాయి.ఇక ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగడం కమర్షియల్ అంశాలు అసలు లేకపోవడంతో ఒక సెక్షన్ ఆడియన్స్ కు పెద్దగా రుచించకపోవచ్చు. అలాగే సన్నివేశాలు ఎంతో ఒరిజినల్ గా కొద్దిగా జనాలను డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి సున్నితమైన సినిమాలు అలవాటుపడిన వారికి కూడా ఈ చిత్రం నచ్చకపోవచ్చు

విశ్లేషణ:

మొత్తానికి ‘జై భీమ్’ సినిమా టైటిల్ కు పూర్తిగా న్యాయం చేసింది. సూర్య లాంటి పెద్ద నటుడు ఇలాంటి ఒక చిన్న సినిమా చేయడం పెద్ద ప్లస్. అదీ కాకుండా కోర్టు రూమ్ డ్రామా అద్భుతంగా రావడం, సన్నివేశాలు ఎంతో సహజంగా ఉండడంతో ఈ చిత్రం ఓఓటిలో చూసేందుకు పర్ఫెక్ట్ అవుతుంది. వైవిధ్యమైన సినిమాలు అలాగే వివక్ష పైన తీసిన సినిమాలు ఇష్టపడేవారు అస్సలు మిస్ కాకూడదు.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju