Acharya : ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పిస్తుండగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలోని కథాంశంతో ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో చిరంజీవి – చరణ్ నక్సలైట్లుగా కొన్ని సన్నివేశాలలో కనిపించనున్నారు.
డైరెక్టర్ కొరటాల శివ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల మాదిరిగానే ఆచార్య సినిమాలోనూ తన మార్క్ సామాజిక అంశాలకు హీరో తాలుకూ కమర్షియల్ అంశాలు జోడించినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ క్రేజ్ కి తగ్గట్టు కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా రాసినట్టు సమాచారం. కొన్ని సీన్స్‌లో తండ్రీ కొడుకులు స్క్రీన్ మీద చేసే సందడి అభిమానులకి రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందట. అంతేకాక ‘ఆచార్య’ లో పొలిటికల్ సిస్టమ్ మీద కూడా సెటైర్లు వేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Acharya : మెగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఫిక్స్ అయ్యారు.
ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ నాయకులు సమాజాన్ని ఎలా నడిపిస్తున్నారు.. ఇలాంటి అంశాలను ఆచార్యలో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక చిరు – చరణ్ కలిసి పాల్గొనే యాక్షన్ సీన్స్ కు సంగీతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. కాగా ప్రత్యేకంగా వేసిన ‘ధర్మస్థలి’ సెట్ లో తీసిన సీన్స్ అన్నీ చాలా హైలైట్ గా నిలవనున్నాయట. కాగా ఆచార్య సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ సాంగ్ అండ్ ప్రచార చిత్రాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని మెగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఫిక్స్ అయ్యారు.