NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana : అధికారులకు తలలు కోసేస్తారట..! వామ్మో ఇవేమీ బెదిరింపులు..!? ఆ ఎమ్మెల్యే ఏమన్నారో చూడండి..!!

Telangana : రాజకీయ నాయకులు ఎక్కడైనా ఒకటే!ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా రాజకీయ నాయకులు నోరు పారేసుకుంటున్నారు.

MLA gives threatful warning to officials
MLA gives threatful warning to officials

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు సీన్ లేదు కాబట్టి వారేమీ మాట్లాడకపోయినప్పటికీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నందున అక్కడ హస్తం నేతలు హవా చూపుతున్నారు.ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే పలువురు కామెంట్స్ చేయగా..తాజాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగ్గారెడ్డి…ఇటు పోలీసు అధికారులపై అటు, ఐఏఎస్ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

Telangana : అధికారుల తలలు కోసేస్తానన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.తమ వాళ్లను వేధిస్తున్న అధికారుల పేర్లను నోట్ చేసుకుని…అధికారంలోకి వచ్చాక..వారి మెడలను వంచి తలకాయలను కోస్తామంటూ..ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. కలెక్టర్లు ఐఏఎస్ హోదా విలువ తీస్తున్నారని, చప్రాసీకైనా పవర్ ఉంటుంది..కానీ…కలెక్టర్లకు ఉండదంటూ ఎద్దేవా చేశారు. అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు…అయినా భయపడే ప్రసక్తే లేదు..కాంగ్రెస్ కార్యకర్త మీద..ఏ పోలీసు అధికారి జులుం చేసినా..వారి పేరును నోట్ చేసుకుంటామన్నారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికారులు తప్పుపడుతున్నారు.

సీఎంను కుక్కకన్నా హీనమన్న జీవన్ రెడ్డి!

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణకు కాపలా కుక్క లెక్క ఉంటానన్న కేసీఆర్ కు.. ఇప్పుడు తెలంగాణ ప్రజలే కుక్కల్లా కనిపిస్తున్నారా అని అన్నారు. జగిత్యాల పొలం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణపై చర్చ జరిగితే సభలో లేని కేసీఆర్…ఎక్కడ తాగి పన్నాడో ఆనాడాయనకే తెలియదన్నారు. ‘కుక్కలకు విశ్వాసం ఉంటది..కానీ, విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్. సీఎం పదవిని ఎవడైనా చెప్పుతో సమానం అంటాడా? చెప్పును పట్టుకుని మరింకా ఎందుకు వేలాడుతున్నావు.. ఇడిసిపెట్టొచ్చు కదా? మళ్ళీ నేనే సీఎం అంటావ్? నీ టైం అయిపొయింది. నీ  ఇంట్లో ముసులం పుట్టుంది.. మొగల్ సామ్రాజ్యం మాదిరిగా నీ ఇంట్లో ఔరంగజేబు పుట్టిండు.. నీకు పదవి ఉండదు.. జాగ్రత్త’ అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

 

author avatar
Yandamuri

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju