కింగ్ నాగార్జున హీరోగా సినిమాలేవీ చేయడం లేదు. అయితే కథా చర్చలు మాత్రం జరుపుతున్నాడు. ఈయన హీరోగా `బంగార్రాజు` సినిమా సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుం నాగార్జున రియాలిటీ షో `బిగ్బాస్ 3`తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే సినిమాలపై ఫోకస్ పెడతాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం నాగార్జునతో ఓ బాలీవుడ్ రీమేక్ చేయించాలని నిర్మాత సునీల్ నారంగ్ ఆలోచిస్తున్నాడట. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందిన రైడ్ చిత్రాన్ని నాగార్జునతో తెలుగులో చేయాలనుకుంటున్నారట. బిగ్ బాస్ షో అయిన తర్వాత నాగార్జునతో ఈ రీమేక్ గురించి చర్చలు జరుపుతారట.
previous post
next post