గత ఏడాది `2.0` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమీ జాక్సన్ తర్వాత మరో సినిమా ఏదీ చేయలేదు. తన బాయ్ ఫ్రెండ్, బ్రిటన్‌కు చెందిన వ్యాపార వేత్త జార్జ్ పనాయొటోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తర్వలోనే వీరి పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటున్న తరుణంలో ఎమీజాక్సన్ తాను తల్లిని కాబోతున్నానంటూ ఆదివారం మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించి ఓ రకంగా షాకిచ్చింది. “ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఉంది. ఇంతకు మించి సరైనరోజు ఉండదని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది స్వచ్ఛమైన ప్రేమ. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా! అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాం“ అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.